ప్రత్యేక కరెన్సీ, స్వంత బ్యాంకు ఏర్పాటు చేసిన నిత్యానంద: ముహుర్తం ఇదీ...

By narsimha lodeFirst Published Aug 17, 2020, 5:34 PM IST
Highlights

వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానందస్వామి మరోసారి వార్తల్లో నిలిచారు. తాను నివాసం ఉంటున్నట్టుగా చెబుతున్న 'కైలాస'లో ప్రత్యేక బ్యాంకును ఏర్పాటు చేయనున్నట్టుగా ప్రకటించారు. 

న్యూఢిల్లీ: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానందస్వామి మరోసారి వార్తల్లో నిలిచారు. తాను నివాసం ఉంటున్నట్టుగా చెబుతున్న 'కైలాస'లో ప్రత్యేక బ్యాంకును ఏర్పాటు చేయనున్నట్టుగా ప్రకటించారు. ఈక్వెడార్ నుండి ఆయన ఓ ద్వీపాన్ని కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

కైలాసలో రిజర్వ్ బ్యాంకు తో పాటు ప్రత్యేక కరెన్సీని కూడ అందుబాటులోకి తీసుకురానున్నట్టుగా ఆయన ప్రకటించారు. ఈ కరెన్సీని చెల్లుబాటు అయ్యేలా పలు దేశాలతో ఒప్పందాలను కుదుర్చుకొన్నట్టుగా ఆయన తెలిపారు.

ఈ నెల 22వ తేదీన ప్రత్యేక కరెన్సీని విడుదల చేయనున్నారు. మరోవైపు రిజర్వ్ బ్యాంకు కు కూడ అదే రోజున ఆయన ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా నిత్యానంద తెలిపారు.

పాలసీ డాక్యుమెంట్లు కూడ సిద్దమయ్యాయని కూడ ఆయన ప్రకటించారు. చట్టబద్దంగానే ముందుకు సాగుతున్నట్టుగా ఆయన తెలిపారు. ప్రత్యేక కరెన్సీని చెల్లుబాటు చేసుకొనేందుకు గాను పలు దేశాలతో ఎంఓయూలు కూడ చేసుకొన్నట్టుగా నిత్యానంద తెలిపారు.

నిత్యానంద ఫోటోతో ముద్రించిన కరెన్సీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.  కర్ణాటక తో పాటు దేశంలో పలు చోట్ల నిత్యానందకు  ఆశ్రమాలు ఉన్నాయి. ఆశ్రమాల ముసుగులో నిత్యానంద మహిళలపై లైంగిక దాడులకు పాల్పడినట్టుగా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆయన దేశం విడిచిపారిపోయాడు.

తన దేశానికి ప్రత్యేక పాస్ పోర్టు, జెండా, జాతీయ చిహ్నాన్ని కూడ డిజైన్ చేశారు. ప్రధానమంత్రి కేబినెట్ ను కూడ ఆయన ఏర్పాటు చేసినట్టుగా చెబుతున్నారు.

click me!