గుడ్‌న్యూస్: 2019-20 ఐటీ రిటర్న్స్‌కు నవంబర్ వరకు గడువు

By narsimha lode  |  First Published May 13, 2020, 5:30 PM IST

2019-20 ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయడానికి ఈ ఏడాది నవంబర్ 30వ తేదీ వరకు గడువును పొడిగిస్తున్నట్టుగా కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 


2019-20 ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయడానికి ఈ ఏడాది నవంబర్ 30వ తేదీ వరకు గడువును పొడిగిస్తున్నట్టుగా కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 

బుధవారం నాడు న్యూఢిల్లీలో ఆమె మీడియాతో మాట్లాడారు. చారిటబుల్ ట్రస్టులు,స్వచ్చంధ సంస్థలు, సహకార సంఘాలకు పెండింగ్ రీ ఫండ్స్ సత్వరమే చెల్లించనున్నట్టుగా కేంద్రం తెలిపింది.

Latest Videos

టీడీఎస్ రేట్లను 25 శాతం తగ్గించారు. వడ్డీ, అద్దె, బ్రోకరేజ్, సరఫరా తదితర మొదలైన అన్ని రకాల చెల్లింపులపై ఇది వర్తిస్తోందని కేంద్రం స్పష్టం చేసింది.  ఇది రేపటి నుండి వచ్చే ఏడాది మార్చి 31వరకు ఇది అమల్లో ఉంటుందని కేంద్రం ప్రకటించింది. తద్వారా సుమారు రూ. 50 వేల కోట్లు ప్రజలకు ప్రయోజనం కలిగే అవకాశం ఉందని కేంద్రం అభిప్రాయపడింది.

2019-20 ఆర్ధిక సంవత్సరానికి ఐటీ రిటర్న్స్  దాఖలుకు జూలై 30 వ తేదీ నుండి అక్టోబర్ 30వ తేదీ వరకు గతంలో గడువు పెంచారు. ఈ గడువును ఇవాళ నవంబర్ 30వ  తేదీకి పొడిగించారు.  టాక్స్ ఆడిట్స్ ను గడువును సెప్టెంబర్ 30వ తేదీ నుండి అక్టోబర్ 31వరకు పెంచుతున్నట్టుగా కేంద్ర మంత్రి తెలిపారు.  డేట్ ఆఫ్ అసెస్ మెంట్ కు మూడు మాసాల పాటు గడువును పెంచింది. 

also read:చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రూ. 3 లక్షల కోట్ల రుణాలు: నిర్మలా సీతారామన్

సెప్టెంబర్ నుండి డిసెంబర్ వరకు పొడిగించింది. మార్చి 2021 వరకు గడవు ముగిసిన వారికి వచ్చే ఏడాది సెప్టెంబర్ వరకు గడువును  పొడిగిస్తున్నట్టుగా కేంద్రం తెలిపింది. అయితే ఎలాంటి అదనపు పన్నులు ఉండవని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా  సీతారామన్ తెలిపారు.

also read:జూన్ నుండి ఆగష్టు వరకు ఉద్యోగుల పీఎఫ్‌పై కేంద్రం గుడ్‌న్యూస్: నిర్మలా సీతారామన్
లాక్ డౌన్ నేపథ్యంలో ఐటీ రిటర్న్ దాఖలు చేయడానికి గతంలో కూడ గడువును కేంద్రం పెంచిన విషయం తెలిసిందే.. లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో దేశాన్ని ఆర్ధికంగా పరిపుష్టం చేసేందుకు  ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీలో భాగంగా ఈ నిర్ణయాలను కేంద్రం తీసుకొంది. 

click me!