మద్యం మాఫియా అరాచకం.. ఫిర్యాదు చేశాడని రెండు కాళ్లకు మేకులు దింపి.. చనిపోయాడని వదిలేసి..

By SumaBala BukkaFirst Published Dec 24, 2021, 7:52 AM IST
Highlights

ఆర్ టీఐ కార్యకర్తను అపహరించి దారుణంగా హింసించటమే కాక, రెండు కాళ్లకు మేకులు దింపి, చనిపోయాడని భావించి రోడ్డు పక్కన పడేసి వెళ్లిన క్రూరమైన ఘటన rajastan లో వెలుగుచూసింది. గ్రామానికి సమీపంలో రోడ్డు పక్కన తీవ్ర గాయాలతో పడి ఉన్న ఆయనను గ్రామస్తులు గుర్తించి ఆస్పత్రికి తరలించారు.

రాజస్థాన్ : ఆర్ టీఐ కార్యకర్తను అపహరించి దారుణంగా హింసించటమే కాక, రెండు కాళ్లకు మేకులు దింపి, చనిపోయాడని భావించి రోడ్డు పక్కన పడేసి వెళ్లిన క్రూరమైన ఘటన rajastan లో వెలుగుచూసింది. Liquor mafiaపై ఫిర్యాదు చేసినందుకే మాజీ సర్పంచ్ ఈ దాడి చేయించారని బాడ్ మేడ్ జిల్లాకు చందిన సహ చట్టం కార్యకర్త అమరా రామ్ గోదారా ఆరోపించారు.

గ్రామానికి సమీపంలో రోడ్డు పక్కన తీవ్ర గాయాలతో పడి ఉన్న ఆయనను గ్రామస్తులు గుర్తించి ఆస్పత్రికి తరలించారు. ఆర్ టీఐ కార్యకర్తపై దాడిని రాష్ట్ర మానవ హక్కుల సంఘం తీవ్రంగా పరిగణించింది.  

కాగా, బీహార్ లో గత జూలైలో ఇలాంటి దారుణమే జరిగింది. మద్యం మాఫియా ఒక మహిళా పోలీసును బలీ తీసుకుంది. బీహార్‌లో లిక్కర్ మాఫీయా రెచ్చిపోయింది. నాటు సారా స్థావరాలపై దాడులు చేసేందుకు వెళ్లిన పోలీసులపై తయారీదారులు తిరగబడ్డారు. పోలీసుల్ని పరిగెత్తించి, పరిగెత్తించి కొట్టారు. కర్రలతో విచక్షణారహితంగా విరుచుకుపడ్డారు. ప్రత్యేక బలగాలు వచ్చినా కూడా లాభం లేకుండాపోయింది. మహిళలు, చిన్నారులు వారిపై దాడి చేశారు. పోలీసుల వాహనాలను ధ్వంసం  చేశారు. ఈ ఘటనలో మహిళా పోలీస్ ప్రాణాలు విడిచింది. పదుల సంఖ్యలో పోలీసులకు గాయాలయ్యాయి. 

ఇదిలా ఉండగా, Karnatakaలోని మంగళూరులో అమానవీయ ఘటన జరిగింది. అనుమానంతో Fishermen తోటి మత్స్యకారుడితో అత్యంత దారుణంగా వ్యవహరించారు. బట్టలూడదీసి, తలకిందులుగా వేలాడదీసి.. అత్యంత పాశవికంగా వ్యవహరించారు. దీనికి సంబంధించిన Video ఇప్పుడు వైరల్ గా మారడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. 

అమానవీయం.. సెల్ ఫోన్ దొంగిలించాడంటూ, బట్టలూడదీసి తలకిందులుగా వేలాడదీసి...

వివరాల్లోకి వెడితే..  సెల్ ఫోన్ Theft చేశాడని ఆరోపణతో సాటి  మత్స్యకారుడిపై సహచరులు దాడి చేశారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన వైల శ్రీను మంగళూరులో పని చేస్తున్నాడు. బుధవారం ఓ మత్స్యకారుడి Cell phone కనిపించ కుండా పోయింది. దీంతో ఆ సెల్ ఫోన్ ను శ్రీనునే దొంగిలించాడని అనుమానించారు.దాని గురించి అతన్ని నిలదీశారు. తాను తీయలేదని చెప్పడంతో దాడికి దిగారు. 

మిగిలిన వారు అతన్ని తలకిందులుగా వేలాడదీసి కొట్టారు. సెల్ఫోన్ ఎక్కడ పెట్టావో చెప్పమంటూ వేధించారు.  ఆ తర్వాత అతడిని తాడుతో కట్టేశారు. శ్రీనును కొట్టిన మత్స్యకారులు కూడా ఆంధ్రప్రదేశ్ కు చెందిన  వారేనని సమాచారం. అయితే ఈ తతంగం మొత్తాన్ని ఎవరు వీడియో తీయడంతో అది వైరల్ గా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు  మంగళూరు పోలీస్ కమిషనర్ శశికుమారం వెల్లడించారు.

click me!