పీకలదాకా తాగిన వరుడు.. కాబోయే అత్తగారి మెడలో..!

Published : Jun 04, 2021, 10:08 AM IST
పీకలదాకా తాగిన వరుడు.. కాబోయే అత్తగారి మెడలో..!

సారాంశం

ఫుల్లుగా తాగి ఉండటంతో వరమాల మార్చుకునే సమయంలో.. వధువుకి బదులు ఆమె తల్లి.. అంటే కాబోయే అత్త మెడలో దండ వేయబోతాడు.

పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వస్తుంది. ఆ రోజుని జీవితాంతం గుర్తుంచుకోవాలని అనుకుంటారు. అలాంటిది ఓ వ్యక్తి.. తన పెళ్లికే పీలకదాకా తాగి మండపంలో అడుగుపెట్టాడు. ఎంతలా తాగాడంటే.. కనీసం.. వధువు మెడలో వరమాల కూడా వేయలేని స్థితిలో ఉండిపోయాడు.

వధువు మెడలో వేయాల్సిన వరమాలను కాబోయే అత్తగారి మెడలో వేయబోయాడు. కాగా.. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. నిరంజన్‌ మహామాత్ర అనే వ్యక్తి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన ఈ వీడియోలో పెళ్లి జరుగుతుంటుంది. ఇక వరుడు తప్పతాగి మంటపానికి చేరుకుంటాడు. ఫుల్లుగా తాగి ఉండటంతో వరమాల మార్చుకునే సమయంలో.. వధువుకి బదులు ఆమె తల్లి.. అంటే కాబోయే అత్త మెడలో దండ వేయబోతాడు. పక్కనున్న వారు ప్రమాదాన్ని గ్రహించి పెళ్లికొడుకుని పక్కకు జరపుతారు.

 

ఆ తర్వాత వరుడి స్నేహితులు అతడిని పట్టుకుని.. వధువు మెడలో వరమాల వేయించే ప్రయత్నం చేస్తారు. కానీ ఫుల్లుగా తాగి ఉండటంతో వధువు మెడలో వరమాల వేయకుండానే స్టేజీ మీదే పడిపోతాడు. పెళ్లికి వచ్చిన వారంతా వరుడి బిత్తరి చర్యకు షాక్‌ అయ్యారు. ఈ సంఘటన  ఎప్పుడు, ఎక్కడ జరిగింది అనే దాని గురించి ఎలాంటి వివరాలు లేవు.కొందరు ఈ వీడియో చాలా పాతదని.. ఇప్పటిది కాదని కామెంట్స్ పెట్టడం గమనార్హం. 

PREV
click me!

Recommended Stories

Why People Share Everything on WhatsApp Status? | Psychology on WhatsApp Status| Asianet News Telugu
Cigarette Price: 20 రూపాయ‌లున్న సిగ‌రెట్ ధ‌ర ఫిబ్ర‌వ‌రి త‌ర్వాత ఎంత కానుందో తెలుసా.?