గౌతమ్ గంభీర్ పై ఆరోపణలు... భగత్ సింగ్ వ్యాఖ్యలతో కౌంటర్

Published : Jun 04, 2021, 09:28 AM ISTUpdated : Jun 04, 2021, 09:36 AM IST
గౌతమ్ గంభీర్ పై ఆరోపణలు... భగత్ సింగ్ వ్యాఖ్యలతో కౌంటర్

సారాంశం

అయితే.. కరోనా చికిత్సలో ఉపయోగించే ఫాబి ఫ్లూ ఔషధాన్ని పెద్దమొత్తంలో కొనుగోలు చేసి ప్రజలకు ఉచితంగా అందించారు.  

దేశరాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి ఎంతలా విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇలాంటి సమయంలో.. కరోనా రోగులకు సహాయం చేసేందుకు బీజేపీ ఎంపీ, ఇండియన్ మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ చాలా రకాల సేవలు అందించారు. తన ఫౌండేషన్ సాయంతో ఎన్నో సేవలు చేశారు.

అయితే.. కరోనా చికిత్సలో ఉపయోగించే ఫాబి ఫ్లూ ఔషధాన్ని పెద్దమొత్తంలో కొనుగోలు చేసి ప్రజలకు ఉచితంగా అందించారు.

ఈ అంశాన్ని న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. ఔషధాల కొరత ఉన్న సమయంలో గంభీర్ అంతపెద్దమొత్తంలో ఫాబి ఫ్లూ ఎలా కొనుగోలు చేయగలిగాడని ప్రశ్నించింది. తాజా విచారణలో, గంభీర్ కు చెందిన స్వచ్ఛంద సంస్థ ఫాబి ఫ్లూ ఔషధాన్ని అనుమతుల్లేకుండానే కొనుగోలు చేసిందని ఢిల్లీ ఔషధ నియంత్రణ సంస్థ న్యాయస్థానానికి తెలియజేసింది.

 

ఈ నేపథ్యంలో, గంభీర్ ట్విట్టర్ లో స్పందించారు. "నేను మానవుడ్ని.... మానవాళి వేదన చెందుతుంటే నేను తట్టుకోలేను" అంటూ నాడు భగత్ సింగ్ చేసిన వ్యాఖ్యలను ఉటంకించారు. తద్వారా ప్రజల క్షేమం కోసమే తాను ఫాబి ఫ్లూ కొనుగోలు చేశానన్న తన మనోభావాలను ఈ విధంగా వెల్లడించారు.

PREV
click me!

Recommended Stories

Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu
Fresh Snowfall in Shimla Delights Tourists: రికార్డు స్థాయిలో సిమ్లాలో మంచు వర్షం| Asianet Telugu