నిన్నటితో పోలిస్తే తగ్గిన కరోనా కేసులు, మరణాలు

By narsimha lodeFirst Published Jun 4, 2021, 10:00 AM IST
Highlights

ఇండియాలో  కరోనా కేసులు తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. కరోనా కేసులతో పాటు మరణాలు కూడ తగ్గినట్టుగా వైద్య ఆరోగ్యశాఖ గణాంకాలు చెబుతున్నాయి. 

న్యూఢిల్లీ: ఇండియాలో  కరోనా కేసులు తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. కరోనా కేసులతో పాటు మరణాలు కూడ తగ్గినట్టుగా వైద్య ఆరోగ్యశాఖ గణాంకాలు చెబుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 1,32, 364 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో 2713 మంది మరణించారు. 
గురువారం నాడు మాత్రం దేశంలో 1,32, 154 కరోనా కేసులు నమోదు కాగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 2,887గా నమోదైంది. గురువారం నాటితో పోలిస్తే శుక్రవారం నాటికి కరోనా కేసులు, మరణాల సంఖ్య తగ్గింది.

కొన్ని రోజులుగా దేశంలో  కరోనా కేసులు 1.5 లక్షల దిగువన నమోదౌతున్నాయి. మరణాల సంఖ్య కూడ తగ్గుతోంది. గత 24 గంటల్లో 20,75,428 మంది కరోనా పరీక్షలు నిర్వహిస్తే 1,32,364 మందికి కరోనా సోకింది. దేశంలో ఇప్పటివరకు 2,85,74,350 మందికి కరోనా సోకింది. కరోనాతో 3,40,702 మంది మరణించారు. కరోనా నుండి రికవరీ రేటు 92.79 శాతానికి పెరిగింది. యాక్టివ్ కేసుల సంఖ్య 6.02 శాతం తగ్గింది.  దేశంలో 16,35,993 యాక్టివ్ కేసులున్నాయి. కరోనాతో నిన్న ఒక్క రోజే 2,07,071 మంది కోలుకొన్నారు.  దేశంలో ఇప్పటివరకు 2.65 మంది కరోనా నుండి కోలుకొన్నారు. 
 

click me!