Presidential Election 2022: "ఆమెను నామినేట్ చేయ‌డం ఒడిశాకు గర్వకారణం": నవీన్ పట్నాయక్ హ‌ర్షం

By Rajesh KFirst Published Jun 22, 2022, 3:09 AM IST
Highlights

Presidential Election 2022: ఎన్డీయే అభ్య‌ర్థిగా.. ఒడిశా గ‌వ‌ర్న‌ర్ ద్రౌపది ముర్ము ప్ర‌క‌టించ‌డంపై ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి నవీన్ పట్నాయక్ మద్దతు సంకేతాలు ఇచ్చారు. ఆమెను రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా ఎన్నుకోవ‌డం.. ఒడిశా రాష్ట్ర ప్రజలకు గర్వకారణమని అన్నారు. ఒడిశా ఎంపీలు, ఎమ్మెల్యేలందరి త‌న‌కు ఉంటుందని  ద్రౌపది ముర్ము ఆశిస్తున్నారు.  
 

Presidential Election 2022: రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే తరఫు అభ్యర్థి ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. బీజేపీ కూట‌మి(NDA) అభ్యర్థిగా జార్ఖండ్‌ మాజీ గవర్నర్‌ ద్రౌపది ముర్మును (Draupadi Murmu) బరిలో దించింది. ఈ ఆంశం గురించి బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశమైంది. ఈ స‌మావేశంలో దాదాపు 20మంది పేర్లు పరిశీలనకు వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. ఏన్డీయే పక్షాలన్ని.. రాష్ట్రపతిగా ఎస్టీ మహిళను చేయాలని నిర్ణ‌యించ‌డంతో అభ్య‌ర్థిగా ద్రౌపది ముర్మును ప్రకటించారు. 

కాగా, ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేట్ అయిన ద్రౌపది ముర్ముకు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అభినందనలు తెలిపారు. ఆమెను రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా ఎన్నుకోవ‌డం.. ఒడిశా రాష్ట్ర ప్రజలకు గర్వకారణమని అన్నారు. రాష్ట్రపతి ఎన్నికలకు ద్రౌపది ముర్ము అభ్యర్థిత్వం గురించి ప్రధాని నాతో చర్చించినప్పుడు తాను చాలా సంతోషించాన‌ని తెలిపారు.

ఒడిశాలో నవీన్ పట్నాయక్ పార్టీ బీజేడీ అధికారంలో ఉంది. ఆమె రాష్ట్రం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు, అలాగే.. బిజెడి-బిజెపి ప్రభుత్వంలో మంత్రిగా కూడా ప‌నిచేయ‌డంతో ఒడిశాలోని ఎంపీలు, ఎమ్మెల్యేలందరూ కూడా ఆమెకు మద్దతు ఇస్తారని అంద‌రూ భావిస్తున్నారు. పట్నాయక్ ట్వీట్ తర్వాత.. ముర్ము అభ్యర్థిత్వానికి BJD మద్దతు ఇస్తుందని నమ్ముతారు. 
 
 ఈ నిర్ణయంపై జార్ఖండ్ మాజీ గవర్నర్ ముర్ము సంతోషం వ్యక్తం చేశారు. ఎన్డీయే తరఫున రాష్ట్రపతి అభ్యర్థిని తానే కావ‌డం ఆశ్చర్యంగానూ, సంతోషాన్ని కలిగిస్తోందని అన్నారు.ఒడిశా ఎంపీలు, ఎమ్మెల్యేలందరి త‌న‌కు ఉంటుందని  ద్రౌపది ముర్ము ఆశిస్తున్నారు.  

ద్రౌపది ముర్ము ఎవరు?

గిరిజన సమాజానికి చెందిన ద్రౌపది ముర్ము గ‌త ఆరేళ్ల నెలలుగా జార్ఖండ్‌ గవర్నర్‌గా ప‌నిచేస్తున్నారు. 
ద్రౌపది ముర్ము ఒడిషా రాష్ట్రంలోని మయూర్‌భంజ్ జిల్లాకు చెందిన ఉపర్‌బేడా గ్రామం నుంచి వచ్చారు. ఈమె సంతల్ అనే గిరిజన కుటుంబానికి చెందిన వారు. ఆమె 1997లో రాజకీయ అరంగేట్రం చేశారు.

అంతకుముందు ఒక సాధారణ ఉపాధ్యాయురాలు పని చేశారు. 1997లోనే బీజేపీ తరపున ఒడిషా షెడ్యూల్డ్ ట్రైబ్ మోర్చా ఉపాధ్యాక్షురాలిగా పనిచేశారు. అలాగే..  నవీన్ పట్నాయక్ ప్రభుత్వంలో 2000 నుంచి 2004 మధ్య ఆమె మంత్రిగా కూడా సేవ‌లందించారు. అదే సమయంలో ఆమె రవాణా, వాణిజ్య,  షిషరీస్ అనిమల్ హస్బెండ్రీ శాఖా మంత్రిగా పనిచేశారు.

ఇక‌,రాష్ట్రపతి ఎన్నికలకు ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హాను బరిలోకి దింపాయి. కానీ, రాష్ట్రపతి ఎన్నికల్లో సంఖ్యాబలం ప్రాతిపదికన బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ బలమైన అభ్య‌ర్థే రాష్ట్ర‌ప‌తి కావ‌డం ఖాయం. ఒడిశా లోని బిజెడి, ఏపీలోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ వంటి పార్టీల మద్దతు లభిస్తుందని భావిస్తున్నారు. ఆమె గెలిస్తే దేశానికి తొలి గిరిజన మహిళ రాష్ట్రపతి అవుతారు. 

ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం జూలై 24తో ముగియనుంది. దీంతో తదుపరి రాష్ట్రపతి ఎన్నిక (అధ్యక్ష ఎన్నిక 2022)కి జూలై 18న ఓటింగ్ జరుగుతోంది. రాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ పత్రాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. నామినేషన్ల దాఖలుకు జూన్ 29 చివరి తేదీ.

 

click me!