
Presidential Election 2022: రాష్ట్రపతి ఎన్నికల్లో (Presidential Election) ఎన్డీయే తరఫు అభ్యర్థి ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. బీజేపీ కూటమి( ఎన్డీయే) తమ అభ్యర్థిగా జార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్మును (Draupadi Murmu) బరిలో దించింది. నేడు రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థిని ఎంపిక చేసేందుకు భేటీ అయినా బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశమైంది. ఈ సమావేశంలో దాదాపు 20మంది పేర్లు పరిశీలనకు వచ్చినట్టు తెలిపారు. రాష్ట్రపతిగా ఎస్టీ మహిళను చేయాలని ఏన్డీయే పక్షాలన్నింటి నిర్ణయించుకున్న తరువాతే.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) ఈ తన తరుపు అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ప్రకటించారు.
ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఇతర పార్లమెంటరీ బోర్డు సభ్యులు పాల్గొన్నారు. సమావేశం.
ఆమె గొప్ప రాష్ట్రపతిగా నిలుస్తారు: మోదీ
ఎన్డీయే తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్మును ఎంపిక చేయడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తంచేశారు. ప్రధాని ట్వీట్ చేస్తూ.. పేదరికాన్ని, కష్టాలు అనుభవించిన లక్షలాది మంది ప్రజలకు ఆమె జీవితం ఎంతో ప్రేరణనిస్తుందని, విధానపరమైన విషయాల పట్ల ఆమెకున్న అవగాహన, దయగల స్వభావం మన దేశానికి ఎంతో మేలు చేస్తాయని అన్నారు. ద్రౌపది ముర్ము తన జీవితాన్ని సమాజ సేవకే అంకితం చేశారని కొనియాడారు. ఆమె మన దేశానికి గొప్ప రాష్ట్రపతిగా నిలుస్తారన్న విశ్వాసం తనకు ఉందన్నారు.
ద్రౌపది ముర్ము ఎవరు?
గిరిజన సమాజానికి చెందిన ద్రౌపది ముర్ము గత ఆరేళ్ల నెలలుగా జార్ఖండ్ గవర్నర్‌గా పనిచేస్తున్నారు. ద్రౌపది ముర్ము ఒడిషా రాష్ట్రంలోని మయూర్‌భంజ్ జిల్లాకు చెందిన ఉపర్‌బేడా గ్రామం నుంచి వచ్చారు. ఈమె సంతల్ అనే గిరిజన కుటుంబానికి చెందిన వారు. ఆమె 1997లో రాజకీయ అరంగేట్రం చేశారు.
అంతకుముందు ఒక సాధారణ ఉపాధ్యాయురాలు పని చేశారు. 1997లోనే బీజేపీ తరపున ఒడిషా షెడ్యూల్డ్ ట్రైబ్ మోర్చా ఉపాధ్యాక్షురాలిగా పనిచేశారు. అలాగే.. నవీన్ పట్నాయక్ ప్రభుత్వంలో 2000 నుంచి 2004 మధ్య ఆమె మంత్రిగా కూడా సేవలందించారు. అదే సమయంలో ఆమె రవాణా, వాణిజ్య, షిషరీస్ అనిమల్ హస్బెండ్రీ శాఖా మంత్రిగా పనిచేశారు.