రేపటి నుంచి అయోధ్య రామయ్య దర్శనం ప్రారంభం కానుంది. భక్తులు రేపటి నుంచి ఆయనను దర్శించుకుని అర్చనలు చేసుకోవచ్చు. టైమింగ్స్ వివరాలు కూడా వచ్చాయి. అంతేకాదు, ఎంట్రీ కోసం పాస్‌లు ఎలా పొందాలో కూడా అధికారిక వెబ్ సైట్ తెలియజేస్తున్నది.
Ram Temple: అయోధ్యలో నిర్మిస్తున్న చారిత్రక రామ మందిరం ప్రారంభమైంది. రేపటి నుంచి భక్తులు ఈ ఆలయంలో రామ్ లల్లా దర్శనం చేసుకోవచ్చు. దర్శనాలు, ఆర్తి, పూజలు చేసుకోవచ్చు. ఈ దర్శనం, ఆర్తి టైమింగ్స్ తెలుసుకుందాం. అలాగే.. వీటి కోసం ఆన్‌లైన్‌లో పాస్‌లు ఎలా పొందాలో కూడా తెలుసుకుందాం.
దర్శనం టైమిగ్స్
undefined
అయోధ్య రామ మందిరంలో రామ్ లల్లా దర్శనం ఉదయం 7 గంటల నుంచి 11.30 గంటల వరకు ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఉంటుంది. ఇక జాగరణ్ ఆర్తి ఉదయం 6.30 గంటలకు, సంధ్యా ఆర్తి రాత్రి 7.30 గంటలకు ఉంటుంది.
పాస్‌లు ఎలా పొందాలి?
ఆర్తి, దర్శనాల కోసం భక్తులు ఆఫ్‌లైన్‌లో, ఆన్‌లైన్‌లోనూ పొందవచ్చు. ఆన్‌లైన్‌లో పొందడానికి ఇలా చేయండి..
1. అయోధ్య రామ్ ఆలయం అధికారిక వెబ్ సైట్‌లోకి వెళ్లాలి.(అధికారిక వెబ్ సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
2. మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ కావాలి.
3. మొబైల్‌కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేసి మీ ఐడెంటిటీని వెరిఫై చేయాలి.
4. ఆ తర్వాత మై ప్రొఫైల్ సెక్షన్ వెళ్లాలి.
5. అర్చన కోసం, దర్శనం కోసం మీకు అవసరమైన స్లాట్‌ను ఎంచుకోవాలి.
6. అవసరమైన సమాచారం ఇవ్వాలి.
7. వివరాలు పొందుపరిచి బుకింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవాలి. బుకింగ్ సక్సెస్ ఫుల్ అవుతుంది.
8. విజయవంతంగా బుకింగ్ అయ్యాక ధ్రువీకరణ సమాచారం వస్తుంది.
9. ఆ తర్వాత మందిరం కౌంటర్ నుంచి పాస్‌లు తీసుకుని లోనికి ప్రవేశించాలి.
Also Read: Ayodhya: అయోధ్యలో తిరుమల ప్రస్తావన తెచ్చిన పవన్ కళ్యాణ్.. ఏమన్నారంటే?
ప్రస్తుతానికైతే ఆన్‌లైన్ బుకింగ్ అందుబాటులో లేదు. అప్‌డేట్ కోసం ఆ అధికారిక వెబ్ సైట్ తరుచూ సందర్శించండి.
ఆఫ్‌లైన్ పాస్‌లను క్యాంప్ ఆఫీసులో సరైన ఐడీ ప్రూఫ్ చూపి తీసుకోవచ్చు. అదే రోజు స్లాట్ బుక్ చేసుకోవాలనుకునేవారు ఆర్తి చేయడానికి 30 నిమిషాల ముందు ఆలయానికి రావాలి. ముందుగా వచ్చిన వారికి ముందుగా పాస్‌లు ఇస్తారు. మీకు ఇచ్చిన పాస్‌లపై ఉన్న క్యూఆర్ కోడ్‌ల ద్వారా ఆలయంలోకి ఎంట్రీ ఉంటుంది.