కాంగ్రెస్‌ టార్చ్ ర్యాలీలో ఆప‌శృతి.. కుప్ప‌కూలిన వేదిక, ప‌లువురికి గాయాలు

Published : Apr 03, 2023, 01:14 PM IST
కాంగ్రెస్‌ టార్చ్ ర్యాలీలో ఆప‌శృతి.. కుప్ప‌కూలిన వేదిక, ప‌లువురికి గాయాలు

సారాంశం

Bilaspur: ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ టార్చ్ ర్యాలీలో వేదిక కుప్పకూలింది. 'సేవ్ డెమోక్రసీ టార్చ్ ర్యాలీ' గాంధీచౌక్ నుంచి వేదిక ఏర్పాటు చేసిన దేవకీనందన్ చౌక్ వరకు సాగింది. అయితే, ఎక్కువ మొత్తంలో నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు వేదిక‌పైకి చేరుకోవ‌డంతో అది కుప్ప‌కూలింది.  

Stage collapses at Congress torch rally: కాంగ్రెస్ పార్టీ నిర్వ‌హించిన ఒక ర్యాలీలో అప‌శృతి చోటుచేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ టార్చ్ ర్యాలీలో వేదిక కుప్పకూలింది. 'సేవ్ డెమోక్రసీ టార్చ్ ర్యాలీ' గాంధీచౌక్ నుంచి వేదిక ఏర్పాటు చేసిన దేవకీనందన్ చౌక్ వరకు సాగింది. అయితే, ఎక్కువ మొత్తంలో నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు వేదిక‌పైకి చేరుకోవ‌డంతో అది కుప్ప‌కూలింది.

వివ‌రాల్లోకెళ్తే.. లోక్‌సభ ఎంపీగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్ పూర్ లో ఏర్పాటు చేసిన సభ వేదిక కూప్ప‌కూలింది. వేదిక కూలిపోవడంతో వేదికపై ఉన్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మోహన్ మార్కమ్, ఇతర నేతలు కిందపడిపోయారు. ఈ ఘ‌ట‌న‌లో ప‌లువురికి స్వ‌ల్ప‌ గాయాలు అయిన‌ట్టు స‌మాచారం.  దీనికి సంబంధించిన వీడియోను వార్తా సంస్థ ఏఎన్ఐ షేర్ చేసింది. 

'సేవ్ డెమోక్రసీ టార్చ్ ర్యాలీ' గాంధీచౌక్ నుంచి వేదిక ఏర్పాటు చేసిన దేవకీనందన్ చౌక్ వరకు నిర్వహించారు. సాయంత్రానికి పాదయాత్ర గమ్యస్థానానికి చేరుకోగానే సీనియర్ నాయకులతో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు వేదికపైకి ఎక్కడంతో అది కుప్పకూలింది. ఇదిలావుండగా, 'మోడీ ఇంటిపేరు' పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు తనకు విధించిన శిక్ష, జైలు శిక్షను సవాలు చేస్తూ రాహుల్ గాంధీ అప్పీల్ కు ముందు ప్రియాంక గాంధీ వాద్రాతో సహా పలువురు కాంగ్రెస్ అగ్రనేతలు సోమవారం సమావేశమై తమ వ్యూహాన్ని రూపొందించారు. 

దొంగలందరికీ మోడీ అనే ఇంటిపేరు ఎలా ఉంటుందంటూ వ్యాఖ్య‌ల‌పై భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే, గుజరాత్ మాజీ మంత్రి పూర్ణేష్ మోడీ రాహుల్ గాంధీపై పరువు నష్టం దావా వేశారు. 2019లో చేసిన వ్యాఖ్యలపై బీహార్ మాజీ ఉపముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ మరో పరువు నష్టం దావా వేశారు. ఈ కేసుకు సంబంధించి ఏప్రిల్ 12న తమ ముందు హాజరుకావాలని పాట్నా కోర్టు కాంగ్రెస్ నేతను ఆదేశించింది.

ఇదే క్ర‌మంలో లోక్ సభ సభ్యత్వానికి సంబంధించి రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడిన తర్వాత దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రాహుల్ లోక్ సభ సభ్యత్వాన్ని కోల్పోయిన నేపథ్యంలో భావసారూప్యత కలిగిన ప్రతిపక్షాలను తమ చుట్టూ కూడగట్టే ప్రయత్నం చేస్తోంది. అదానీ వ్యవహారం నుంచి ప్రజల దృష్టిని మరల్చే ఎత్తుగడగా కాంగ్రెస్ ఆరోప‌ణ‌లు గుప్పించింది. అయితే, అదానీ వ్య‌వ‌హారం గురించి ప్ర‌శ్నిస్తూనే ఉంటామ‌ని రాహుల్ గాంధీ స్ప‌ష్టం చేశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్