అమిత్ షా కు వెంకయ్య షాక్: ఏ ఒక్క భాషనో ఇతరులపై రుద్దొద్దంటూ ప్రకటన

Published : Sep 20, 2019, 10:46 PM IST
అమిత్ షా కు వెంకయ్య షాక్: ఏ ఒక్క భాషనో ఇతరులపై రుద్దొద్దంటూ ప్రకటన

సారాంశం

ప్రజలు వీలైనన్ని ఎక్కువ భాషలు నేర్చుకోవాలి కానీ ఏ ఒక్క భాషనో ఇతరులపై రుద్దడం లేదా వ్యతిరేకించడం వంటివి చేయోద్దని  వెంకయ్య నాయుడు ప్రకటనలో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. 

న్యూఢిల్లీ: కేంద్రహోంశాఖ మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు షాక్ ఇచ్చారు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. దేశంలో ఏ భాషనూ బలవంతంగా ఇతరులపై రుద్దడం కానీ, వ్యతిరేకించడం గానీ చేయోద్దని ప్రజలకు సూచించారు. 

ఈ మేరకు ఉపరాష్ట్రపతి కార్యాలయం శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. హిందీ దేశభాష కావాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యలు చేయడంతో రాజకీయ దుమారం రేగిన సంగతి తెలిసిందే. 

ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రకటన విడుదల చేయడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ప్రజలు వీలైనన్ని ఎక్కువ భాషలు నేర్చుకోవాలి కానీ ఏ ఒక్క భాషనో ఇతరులపై రుద్దడం లేదా వ్యతిరేకించడం వంటివి చేయోద్దని  వెంకయ్య నాయుడు ప్రకటనలో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. 

అంతకుముందు వెంకయ్య నాయుడు న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులు వీలును బట్టి తల్లిదండ్రుల సహకారంతో దేశంలోని అన్ని పర్యాటక ప్రాంతాలు చుట్టి రావాలని సూచించారు. 

పర్యాటక ప్రాంతాలు చుట్టి రావడం వల్ల వేర్వేరు ప్రాంతాల్లో సంస్కృతులు, భిన్నఆహార అలవాట్లు, భాష వంటి వాటిపై అవగాహన ఏర్పడుతుందని విద్యార్థులకు సూచించారు. 
పిల్లల పాఠశాల తరగతుల్లో 50 శాతం సమయం బయటే గడపాల్సిన అవసరం ఉందని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. దాని వల్ల పిల్లలు మానసికంగా, శారీరకంగా ఉల్లాసంగా ఉంటారని వెంకయ్యానయుడు అభిప్రాయపడ్డారు.  

ఈ వార్తలు కూడా చదవండి

వివాదానికి తెర: హిందీని బలవంతంగా రుద్దమన్న అమిత్ షా

దేశభాషపై అగ్గిరాజేసిన అమిత్ షా : అసదుద్దీన్ ఓవైసీ ఘాటు కౌంటర్

దేశమంతా హిందీ నేర్చుకోవాల్సిందేనన్న అమిత్ షా : స్టాలిన్ వార్నింగ్

PREV
click me!

Recommended Stories

Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu
Fresh Snowfall in Shimla Delights Tourists: రికార్డు స్థాయిలో సిమ్లాలో మంచు వర్షం| Asianet Telugu