
Dominica announces highest national honor for PM Modi : కరేబియన్ దీవి దేశం డొమినికా తన అత్యున్నత జాతీయ పురస్కారాన్ని ప్రధాని మోడీకి ప్రకటించింది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో డొమినికాకు ప్రధాని మోడీ చేసిన సహాయం, భారత్, డొమినికా మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేసినందుకు డొమినికా కామన్వెల్త్ తన అత్యున్నత జాతీయ పురస్కారం 'డొమినికా అవార్డ్'ని ప్రధాని నరేంద్ర మోడీకి ఇవ్వనుంది. నవంబర్ 19 నుండి 21 వరకు వరకు గయానాలోని జార్జ్‌టౌన్‌లో జరగనున్న ఇండియా-కారికామ్ సదస్సులో డొమినికా కామన్వెల్త్ అధ్యక్షుడు సిల్వానీ బర్డెన్ ఈ అవార్డును మోడీకి అందజేస్తారు.
భారతదేశంలో అత్యధిక జీతం ఇచ్చే టాప్-10 ప్రభుత్వ ఉద్యోగాలు ఏంటో తెలుసా?
డొమినికా ప్రధాని కార్యాలయం ఈ విషయమై ప్రకటన విడుదల చేస్తూ "ఫిబ్రవరి 2021లో 70,000 ఆస్ట్రాజెనెకా కోవిడ్-19 వ్యాక్సిన్ డోసులను డొమినికాకు ప్రధాని మోడీ అందించారు. ఇది డొమినికా తన కరేబియన్ పొరుగు దేశాలకు కూడా సహాయం అందించడానికి ఉపయోగపడింది" అని అన్నారు. అలాగే, "ప్రధాని మోడీ నాయకత్వంలో ఆరోగ్యం, విద్య, సమాచార సాంకేతికత రంగాల్లో డొమినికాకు భారతదేశం అందించిన సహాయాన్ని, ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పును ఎదుర్కోవడంలో ఆయన చేసిన కృషిని, స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించడంలో ఆయన పాత్రను గుర్తించి ఈ అవార్డును అందిస్తున్నాం" అని తెలిపింది.
డొమినికా, కరేబియన్ ప్రాంతంతో ప్రధాని మోడీకి ఉన్న సత్సంబంధాలకు డొమినికా కృతజ్ఞతగా ఈ అవార్డును అందిస్తున్నట్లు డొమినికా ప్రధాని స్కెరిట్ చెప్పారు.
ఈ ఒక్క రూపాయి నాణెం ఉంటే చాలు.. 10 లక్షలు మీ సొంతం
"ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డొమినికాకు నిజమైన భాగస్వామి, ముఖ్యంగా ప్రపంచ ఆరోగ్య సంక్షోభం మధ్య మనకు అవసరమైన సమయంలో అతని మద్దతుకు మా కృతజ్ఞతకు చిహ్నంగా, ప్రతిబింబంగా డొమినికా అత్యున్నత జాతీయ పురస్కారాన్ని అందించడం గౌరవంగా ఉంది. ఈ భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి, పురోగతి-స్థితిస్థాపకత గురించి మా భాగస్వామ్య దృష్టిని ముందుకు తీసుకెళ్లడానికి మేము ఎదురుచూస్తున్నామని" తెలిపారు.