విమానంలో ప్రయాణికుడికి ప్రథమచికిత్స... కేంద్రమంత్రి భాగవత్ కరద్ పై ప్రధాని మోదీ ప్రశంసల జల్లు ...

By AN TeluguFirst Published Nov 17, 2021, 11:26 AM IST
Highlights

 కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ భాగవత్ కరద్ పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశంసల జల్లు కురిపించారు. మంగళవారం ఢిల్లీ నుంచి ముంబైకి టేకాఫ్ అయిన ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడికి ఎమర్జెన్సీ వచ్చింది. తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో ప్రయాణికుల్లో ఎవరైనా వైద్యులు ఉన్నారా? అని వెతికారు. సిబ్బంది అడగ్గానే డాక్టర్ అయిన కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ భాగవత్ కరద్ చికిత్స అందించారు. 

మంగళవారం ఢిల్లీ నుంచి ముంబై బయల్దేరిన ఇండిగో విమానం టేకాఫ్ అయిన గంటకు ఓ వ్యక్తి తీవ్ర అనారోగ్యానికి గురైన ఘటనలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ భాగవత్ కరద్ చూపిన చొరవను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశంసించారు. 

మంత్రి అయినా తన వృత్తి ధర్మాన్ని మరిచిపోలేదని.. ఆపదలో ఉన్న వ్యక్తి ప్రాణాలు కాపాడారని ప్రశంసల జల్లు కురిపించారు. ఫ్లైట్ లో ప్రయాణికుడికి ప్రథమ చికిత్స అందించిన కేంద్రమంత్రికి తోటి ప్రయాణికులు సంతోషాతిరేకాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. 

వివరాల్లోకి వెడితే... మంగళవారం ఢిల్లీ నుంచి ముంబై  ఇండిగో విమానం టేకాఫ్ అయింది. ఆ తరువాత గంటకు విమానంలో ఓ ప్రయాణికుడికి ఎమర్జెన్సీ వచ్చింది. తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో విమాన సిబ్బందికి ఏం చేయాలో పాలు పోలేదు. మధ్యలో విమానం ఆపలేరు. దీంతో ప్రయాణికుల్లో ఎవరైనా వైద్యులు ఉన్నారా? అని వెతికారు. సిబ్బంది అడగ్గానే డాక్టర్ అయిన కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ భాగవత్ కరద్ తానున్నానని సమాధానం ఇచ్చారు. 

ఆ passengerకి ఉన్నట్టుండి తల తిప్పినట్టు అయ్యింది. తీవ్ర నీరసం ఆవహించింది. విమానంలో ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంది కానీ.. డాక్టర్ల సలహా లేకుండా ఎలా? దీంతో ముందుకు వచ్చిన Dr. Bhagwat Karad దేవుడిలా కనిపించారు. ఆయన వెంటనే ఆ ప్రయాణికుడి దగ్గరికి వెళ్లి First aid చేశారు. 

delhi to mumbai ఇండిగో ఫ్లైట్ 6E171 బయల్దేరిన గంట తరువాత 40యేళ్ల ఓ ప్రయాణికుడు సడన్ గా అస్వస్థతకు గురయ్యాడు. ఒక్కసారిగా ఒంట్లోని శక్తినంతా ఎవ్వరో లాగేసినట్టుగా నిస్సత్తువగా,  నలతగా అనిపించింది. దీన్ని ఫ్లైట్ సిబ్బంది దృష్టికి తీసుకువెళ్లాడు. వెంటనే వాళ్లకు flightలో ఉన్న union minister సహకరించారు. 

అదే indigo flight లో ప్రథమ చికిత్స మొదలుపెట్టారు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి డాక్టర భాగవత్ కిషన్ రావ్ కరద్. వెంటనే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి.. కాళ్లు పైకి లేపమని సూచించారు. వెంట వెంటనే అతన్ని పొజిషన్లు మార్చి కూర్చోవాల్సిందిగా సూచలను చేశారు. వాటిని పాటించిన ఆ వ్యక్తి ఆరోగ్యం కొంత కుదుటపడినట్టు తోటి ప్రయాణికుడు ఒకరు చెప్పారు. అంతేకాదు ఎమర్జెన్సీ కిట్ లోని ఓ injection ఆయనకు వేశారు.  

ఫ్లైట్‌లో ప్రయాణికుడికి ప్రథమ చికిత్స అందించిన కేంద్ర మంత్రి, తోటి ప్రయాణికుల నుంచి ప్రశంసలు

కేంద్ర మంత్రి ఇచ్చిన ఈ treatment తరువాత ఆ వ్యక్తి ఆరోగ్యం కొంత మెరుగయ్యింది. ఆ తరువాత నలభైఐదు నిమిషాలకు అంటే మధ్యాహ్నం 3.20 ని.లకు మంగళవారం విమానం ముంబైకి చేరుకుంది. విమానం ల్యాండ్ అవ్వగానే సిబ్బంది ఆ ప్రయాణికుడిని హాస్పిటల్ కి తీసుకెళ్లారు. 

అదే విమానంలో ప్రయాణికుడు అమిత్ చవాన్ ఈ ఘటనను ట్వీట్ చేశారు. ఆయన అందులో చెబుతూ... ‘గౌరవనీయులైన కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి Bhagwat Kishan Rao Karad వృత్తి రీత్యా వైద్యుడు. indigo విమానం ఎక్కిన తరువాత ఓ ప్రయాణికుడికి ఆరోగ్య సమస్య తలెత్తడంతో.. ప్రథమ చికిత్స అందించి సహకరించారు. తోటి ప్రయాణికులు కేంద్ర మంత్రి మీద ప్రశంసలు కురిపించారు’ అని చెప్పుకొచ్చారు. 
 
Indigo కూడా కేంద్ర మంత్రి భాగవత్  కరద్ చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలిపింది. కాగా, డాక్టర్  భాగవత్ కిషన్ రావ్ కరద్ మహారాష్ట్ర నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. జులై 2021లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేపట్టిన ప్రక్షాళనలో డాక్టర్  భాగవత్ కరద్ కు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది. 
 

click me!