ఈ డాక్టర్ ఓ అర్జున్ రెడ్డి.. తప్పతాగి మహిళా పేషంట్ ను చితగ్గొట్టి.. సస్పెండై...

Published : Nov 10, 2022, 01:20 PM IST
ఈ డాక్టర్ ఓ అర్జున్ రెడ్డి.. తప్పతాగి మహిళా పేషంట్ ను చితగ్గొట్టి.. సస్పెండై...

సారాంశం

ఓ డాక్టర్ తప్పతాగాడు.. దీంతో అతడికి ఒళ్లూ పై తెలియలేదు. అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి వచ్చిన పేషంట్ ను చికిత్స చేయాల్సింది పోయి.. కొట్టడం మొదలెట్టాడు. 

చత్తీస్ గఢ్ : డాక్టర్ అంటే దైవంతో సమానం.. కానీ ఇటీవలి కాలంలో డాక్టర్లు కీచకుల్లా మారుతున్నారు. పేషంట్లతో దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. దీంతో హాస్పిటల్స్ లో జరిగే ఘోరాలు రోజుకోటి బయటికి వస్తున్నాయి. అలాంటి ఘటనే చత్తీస్ గఢ్ లో జరిగింది. మద్యం మత్తులో ఉన్న డాక్టర్ చికిత్స కోసం వచ్చిన మహిళ పట్ల అత్యంత అమానుషంగా ప్రవర్తించాడు. చికిత్స సమయంలో ఆమెను పదే పదే కొట్టడం ప్రారంభించాడు. ఈ ఘటన చత్తీస్ గఢ్ లోని కోర్బాలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెడితే గైర్వాని గ్రామానికి చెందిన శ్యామ్ కుమార్ అనే వ్యక్తి తన తల్లి సుఖమతికి అర్ధరాత్రి ఆరోగ్యం బాగా లేకపోవడంతో అంబులెన్స్ కి కాల్ చేశాడు. ఆంబులెన్స్ రావడానికి సమయం పడుతుందని చెప్పడంతో శ్యామ్ తన తల్లిని ఆటో రిక్షా లో మెడికల్ కాలేజ్ ఆస్పత్రికి తీసుకు వెళ్ళాడు. అయితే, డాక్టర్ తప్పతాగి ఉండటంతో చికిత్స సమయంలో శ్యామ్ తల్లిని కొట్టడం ప్రారంభించాడు. దీంతో ఒక్కసారిగా శ్యామ్ షాక్ అయి ఎందుకలా చేస్తున్నారంటూ వైద్యుడిని ప్రశ్నించాడు.  

రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసు : ఢిల్లీ పాటియాలా కోర్టుకు హాజరైన జాక్వెలిన్ ఫెర్నాండేజ్...

అయితే సదరు డాక్టర్ శ్యామ్ ను సైలెంట్ గా ఉండు అంటూ అతని తల్లిని పదేపదే కొడుతూనే ఉన్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఆసుపత్రి యాజమాన్యం సదరు డాక్టర్ కి షోకాజ్ నోటీసులిచ్చింది. ఈ మేరకు మెడికల్ కాలేజ్ హాస్పిటల్ డాక్టర్ అవినాష్ మిశ్రామ్ మాట్లాడుతూ సదరు డాక్టర్ కి నోటీసులు ఇచ్చామని, అతను ఎందుకలా చేశాడో పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అందుకు సంబంధించిన వీడియో నెట్ లో వైరల్ అవుతుంది. 

 

PREV
click me!

Recommended Stories

PM Modi Italy Tour Highlights: మోదీ విజన్ కి ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఫిదా| Asianet News Telugu
PM Modi Oslo Visit: ఒస్లో పర్యటనలో మోదీకి అదిరిపోయే స్వాగతం| Asianet News Telugu