అయోధ్య రామాలయంలోని ఈ ప్రత్యేకతలు మీకు తెలుసా?

By SumaBala Bukka  |  First Published Jan 4, 2024, 11:53 AM IST

అయోధ్య రామమందిర నిర్మాణంలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. వెయ్యేళ్లవరకు చెక్కుచెదరని ఆలయం నిర్మాణంతో పాటు ఆలయం లోపలా, వెలుపలా అనేక విశిష్టతలున్నాయి. 


అయోధ్య : అయోధ్యలో రామ మందిరం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. హిందువులంతా రామాలయ ప్రారంభోత్సవ సుముహూర్త గడియల కోసం ఎదురుచూస్తున్నారు. రామాలయనిర్మాణంలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. 

1. రామ మందిరం సాంప్రదాయ నాగర్ శైలిలో నిర్మించారు. 

Latest Videos

2. మందిరం పొడవు (తూర్పు-పడమర) 380 అడుగులు, వెడల్పు 250 అడుగులు, ఎత్తు 161 అడుగులు.

3. మందిరం మూడంతస్తుల్లో నిర్మించారు. ఒక్కో అంతస్తు 20 అడుగుల ఎత్తుతో ఉంటుంది. దీనికి మొత్తం 392 స్తంభాలు. 44 తలుపులు ఉన్నాయి.

అయోధ్య : బాలరాముడి విగ్రహాన్ని చెక్కిన అరుణ్ యోగిరాజ్ గురించి ఆసక్తికర విషయాలివే..

4. ప్రధాన గర్భగుడిలో, శ్రీరాముడి ఐదేళ్ల బాలరాముడిగా (శ్రీరామ్ లల్లా విగ్రహం)కొలువు దీరుతున్నాడు. మొదటి అంతస్తులో శ్రీరామ్ దర్బార్ ఉంటుంది.

5. ఐదు మండపాలు (హాల్) - నృత్య మండపం, రంగ మండపం, సభా మండపం, ప్రార్థన మండపం, కీర్తన మండపాలు ఉంటాయి.

6. రామాలయంలోని మొత్తం గోడలు, స్తంభాల మీద అనేక రకాల దేవతమూర్తులను చెక్కారు. రామాయణ ఘట్టాలను చిత్రించారు. 

7. రామాలయంలోకి ప్రవేశం తూర్పు నుండి ఉంది. ఇక్కడి సింగ్ ద్వార్ గుండా 32 మెట్లు ఎక్కి లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. 

8. దేవాలయానికి వచ్చే వికలాంగులు, వృద్ధుల సౌకర్యార్థం ఆలయంలో ర్యాంప్‌లు లిఫ్టుల ఏర్పాటు చేశారు.

9. మందిర్ చుట్టూ 732 మీటర్ల పొడవు, 14 అడుగుల వెడల్పుతో పార్కోట (దీర్ఘచతురస్రాకార సమ్మేళనం గోడ) నిర్మించారు.

10. పార్కోట నాలుగు మూలల్లో, నాలుగు దేవాలయాలు నిర్మించారు. వీటిల్లో సూర్యభగవానుడు, దేవి భగవతి, వినాయకుడు, శివుడి దేవాలయాలున్నాయి. ఉత్తర భుజంలో మా అన్నపూర్ణ దేవాలయం, దక్షిణం వైపు హనుమంతుని మందిరాలు ఉన్నాయి.

11. మందిర్ సమీపంలో పురాతన కాలం నాటి చారిత్రక బావి (సీతా కూప్) ఉంది.

12. శ్రీ రామ జన్మభూమి మందిర్ కాంప్లెక్స్‌లో, మహర్షి వాల్మీకి, మహర్షి వశిష్ఠ, మహర్షి విశ్వామిత్ర, మహర్షి అగస్త్య, నిషాద్ రాజ్, శబరీమాత,  అహల్య దేవిల మందిరాలున్నాయి. 

13. కాంప్లెక్స్ నైరుతి భాగంలో, కుబేర్ తిలా దగ్గర ఉన్న పురాతన శివాలయాన్ని పునరుద్దరించారు. జటాయువును ప్రతిష్ఠించారు. 

14. మందిరం నిర్మాణంలో ఎక్కడా ఇనుము వాడకపోవడం మరో ప్రత్యేకత.

15. మందిర్ పునాది 14-మీటర్ల మందపాటి రోలర్-కాంపాక్ట్ కాంక్రీట్ (RCC)తో నిర్మించారు. ఈ కాంక్రీట్ కృత్రిమ శిలా రూపాన్ని ఇస్తుంది.

16. భూమిలోని తేమతో ఆలయానికి భవిష్యత్తులో నష్టం వాటిల్ల కుండా ఉండేందుకు 21 అడుగుల ఎత్తులో గ్రానైట్ తో పునాది నిర్మించారు. 


17. మందిర్ కాంప్లెక్స్‌లో మురుగునీటి శుద్ధి కర్మాగారం, నీటి శుద్ధి కర్మాగారం, అగ్నిప్రమాదాలనుంచి భద్రత కోసం నీటి సరఫరా, స్వతంత్ర విద్యుత్ కేంద్రం ఉన్నాయి.

18. 25,000 మంది పట్టే సామర్థ్యంతో యాత్రికుల సౌకర్య కేంద్రం నిర్మించబడుతోంది.ఇది యాత్రికులకు వైద్య సదుపాయాలు, లాకర్ సౌకర్యాన్ని అందిస్తుంది.

19. కాంప్లెక్స్‌లో స్నానాలు చేసే ప్రదేశం, వాష్‌రూమ్‌లు, వాష్‌బేసిన్, ఓపెన్ ట్యాప్‌లు మొదలైన వాటితో ప్రత్యేక బ్లాక్ కూడా ఉంటుంది.

20. మందిర్ పూర్తిగా భారత సాంప్రదాయ, స్వదేశీ సాంకేతికతను ఉపయోగించి నిర్మించబడుతోంది. 70 ఎకరాల విస్తీర్ణంలో 70% పచ్చగా ఉండేలా పర్యావరణ-నీటి సంరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ దీనిని నిర్మిస్తున్నారు.

click me!