
ప్రజలు ఎన్నికల్లో పదే పదే తిరస్కరిస్తే ప్రజాస్వామ్యాన్ని ఎందుకు నిందిస్తున్నారని రాహుల్ గాంధీపై బీజేపీ మండిపడింది. రాహుల్ గాంధీ ఢిల్లీలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన అనంతరం కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పందించారు. ఆయన కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్ పై, రాహుల్ పై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ నాయకుడు సిగ్గుమాలిన, బాధ్యతా రాహిత్య వ్యాఖ్యలు చేశాడని అన్నారు.
ఢిల్లీలో హై టెన్షన్.. కాంగ్రెస్ భారీ ఆందోళన.. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్టు
ఈ సందర్భంగా రవి శంకర్ ఎమర్జెన్సీని ప్రస్తావించారు. రాహుల్ గాంధీ నాన్నమ్మ తన హయాంలో మీడియాపై నిషేధం విధించిందని గుర్తు చేశారు. ఇప్పుడు వారే ప్రజాస్వామ్యం గురించి సలహాలు ఇస్తున్నారని అన్నారు. ‘‘ రాహుల్ గాంధీ గారు దయచేసి ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి. మీ పార్టీలో ప్రజాస్వామ్యం ఉందా? కాంగ్రెస్‌లో మంచి నాయకులు ఉన్నారు. కానీ సోనియా జీ, రాహుల్ జీ, ప్రియాంక జీ మీరు మీ సొంత పార్టీలోనే ఉన్నారు. ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తుంటే దానికి మేము ఎలా బాధ్యులం అవుతాము ’’ అని అన్నారు.
తాను ఎప్పుడూ నిజాలే మాట్లాడతానని రాహుల్ గాంధీ అంటున్నారని రవిశంకర్ ప్రసాద్ అన్నారు. అయితే నేషనల్ హెరాల్డ్ విషయం ఏమిటో ఈరోజు దేశానికి చెప్పాలి. ఈ మొత్తం కేసులో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందే ఆరోపణలు ఉన్నాయి. ‘‘ రాహుల్ గాంధీ ఇప్పుడు దేశంపై విమర్శలు చేస్తున్నారు. తమ రాజకీయ స్వార్థం, అవినీతికి దూరంగా ఉండేందుకు దేశంలోని సంస్థల పరువు తీస్తున్నారు. ఆయన సంస్థల గురించి మాట్లాడుతున్నారు. కరోనా సమయంలో దేశం మొత్తం ఐక్యంగా ఉన్నప్పుడు మీరు ఎంత జోక్ చేసారో చెప్పండి. వ్యాక్సిన్‌ను కూడా ఎగతాళి చేశారు. ’’ అని అన్నారు.
ప్రకృతి అంటే ప్రేమ.. చెట్లంటే ప్రాణం: పర్యావరణ రక్షణ కోసం వీరు చేస్తున్న కృషికి వావ్ అనాల్సిందే..
ఈ రోజు స్టార్టప్‌ల విషయంలో రాహుల్ మాట్లాడారని, ఆయనకు సరైన సమాచారం అందిందా అని ప్రశ్నించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్టార్టప్స్ లో నేడు భారత్ మూడు-నాలుగో స్థానంలో ఉందని ఆయనకు తెలుసా అని అని రవి శంకర్ అన్నారు. నేడు మన దేశంలో 100కు పైగా యునికార్న్‌లు ఉన్నాయని చెప్పారు. ఈరోజు రక్షణ ఒప్పందంలో కోత లేదని, మధ్య దళారులకు మార్గం మూసుకుపోయిందని తెలిపారు. ఆర్టికల్ 370ని కూడా రద్దు చేయడం వల్ల కాశ్మీర్‌లో నేడు త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోందని అన్నారు.
బాల్కనీలోంచి నాలుగేళ్ల కూతురిని తోసేసి.. తల్లి ఆత్మహత్యాయత్నం, చిన్నారి మృతి
2019 ఎన్నికల సమయంలో కూడా రాహుల్ గాంధీ మోదీపై అన్ని రకాల ఆరోపణలు చేశారని, అయితే ప్రజలు ఆయనను భారీ మెజారిటీతో ఎన్నుకున్నారని చెప్పారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన కేసును రవి శంకర్ ప్రసాద్ లేవనెత్తారు. ఇద్దరు గాంధీలకు 76 శాతం వాటా ఉన్న యంగ్ ఇండియన్ అనే సంస్థ నేషనల్ హెరాల్డ్ ఆస్తులను రూ. 5,000 కోట్లకు పైగా ఎలా సంపాదించిందనే దానిపై తాను సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో రాహుల్ గాంధీపై, ఇతరులపై ఉన్న అభియోగాలను కొట్టివేయడానికి న్యాయవ్యవస్థ నిరాకరించిందని, దీంతో ఆయన ఇప్పుడు సంస్థలను నిందిస్తున్నాడని రవి శంకర్ ప్రసాద్ ఆరోపించారు.