భారత దేశం లౌకిక దేశమే అయినా.. మత పరమైనా రాజకీయాలు ఎక్కువయ్యాయి. ఈ విద్వేషాలను రాజకీయ నాయకులు, దేశ వ్యతిరేక శక్తులు తన ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నాయి. స్వాతంత్య్రానికి పూర్వం .. అనంతరం ఇదోక విభజన కారకంగా మారింది.
ఇటీవల ప్రముఖ భారతీయ గాయకుడు షాన్ ముఖర్జీ నెట్టింట్లో ట్రోలింగ్ గురయ్యారు. ఈద్ సందర్భంగా ఆయన ముస్లిం స్కల్ క్యాప్ ధరించి ఉన్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. దీంతో ఆయనపై మత, ద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. ముస్లింల యొక్క స్కల్ క్యాప్ ధరించి ఈద్ శుభాకాంక్షలు చెప్పడం ఎందుకని విమర్శించారు. ఆ ట్రోల్‌లకు ఆయన ధీటైన సమాధానం ఇవ్వడంతో వార్తల్లో నిలిచారు. అంతకు ముందు.. షాన్ తన పోస్టులో.. భారతీయులను శాంతియుతంగా జీవించాలని, అభివృద్ధి కోసం కలిసి పనిచేయాలని కోరారు. ద్వేషంతో నిండిన ప్రజలు జాతీయ ఐక్యత, అభివృద్ధి గురించి కూడా ఆలోచించాలని ఆయన ఆకాంక్షించారు. నెట్టింట్లో మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టబడుతున్నాయనడానికి ఈ ఘటన ఓ ఉదాహరణ.
భారత దేశం లౌకిక దేశమే అయినా.. చాలా కాలంగా మతం, మత విద్వేషాలను రాజకీయ నాయకులు, దేశ వ్యతిరేక శక్తులు ఉపయోగించుకుంటున్నాయి. స్వాతంత్య్రానికి పూర్వం .. మన దేశంలో భారత జాతీయ పోరాటాన్ని విభజించడానికి ప్రయత్నించారు బ్రిటీష్ వారు. స్వాతంత్ర్యం తరువాత.. రాజకీయ సంస్థలు తన స్వార్థ ప్రయోజనాల కోసం మత విద్వేష్వాన్ని ఉపయోగించుకున్నాయి. అలాగే.. విదేశీ శత్రువులు కూడా మన దేశాన్ని బలహీనపరిచేందుకు మతవాదాన్ని ఎంచుకుంటున్నాయి. ఈ పరంపర ఇలానే కొనసాగుతోంది.
undefined
ఓ సారి భారత దేశ చరిత్ర పుటలోకి వేళ్తే.. 1940 దశకంలో మన దేశంలో మత రాజకీయాలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ముస్లిం లీగ్ పాకిస్థాన్‌ను డిమాండ్ చేస్తోంది, ఆదివాసీ మహాసభ అడ్వాసిస్థాన్ కావాలని అడుగుతోంది. దేశంలోని వివిధ ప్రాంతాలలో మత ప్రాతిపాదికన విభజన జరగాలని, ప్రతి వర్గ సమూహం దాని ప్రాతినిధ్యం కోరుతోంది. విషయాన్ని గ్రహించిన నేతాజీ బలమైన భారత దేశం కోసం ఐక్యత అవసరమని పిలుపునిచ్చారు. ఈ సమయంలో ఆయన ఇండియన్ నేషనల్ ఆర్మీనీ, ఆజాద్ హింద్ సర్కార్‌ను స్థాపించాడు.
అలాగే.. కమ్యూనల్ హార్మొనీ కౌన్సిల్ ను కూడా ఏర్పాటు చేశారు. ఈ మండలి హిందూ, ముస్లిం, సిక్కు, క్రైస్తవ ఐక్యతను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మండలికి లెఫ్టినెంట్ కల్నల్ ఎహసాన్ ఖాదిర్ నేతృత్వం వహించారు. నేతాజీకి హిందూ-ముస్లిం ఐక్యత ముఖ్యం. బ్రిటిష్ సైన్యంలోని భారతీయ సిపాయిలు మతపరమైన వంటశాలలను కలిగి ఉండేవారు, అంటే హిందువులు, ముస్లింలు, సిక్కులకు విడివిడిగా ఆహారాన్ని వండేవారు. కానీ తన ఇండియన్ నేషనల్ ఆర్మీ (INA)లో పద్ధతికి ముగింపు పలికారు. తన సైన్యాన్ని జై హింద్ అనే నినాదం కిందికి తీసుకొచ్చారు. INAలో సైనికుల నియమాకాల్లో మతం అనే రాకుండా అన్ని మతాల వారిని తీసుకున్నారు. మత వాదాన్ని పక్కన బెట్టి.. భారతీయులందరికీ ఆహ్వానం పలికారు.
భారతీయుల మధ్య హిందూ-ముస్లిం-సిక్కు-క్రైస్తవ ఐక్యతను పెంపొందించడానికి కౌన్సిల్ ఆగ్నేయాసియా అంతటా విస్తృతమైన ప్రచారం నిర్వహించింది. నేతాజీకి సన్నిహితుడైన అబిద్ హసన్ సఫ్రానీ తన పుస్తకంలో ఇలా వ్రాశాడు. “భారతదేశం మా లక్ష్యం. ఇందుకోసం మేము మత సమూహాలుగా కాకుండా .. జాతిగా నిలిచాము. దాని కారణంగా భారతదేశాన్ని ఉన్నత స్థానంలో నిలబెట్టాలనేదే మా ప్రయత్నం. మేము విడిగా లెక్కించబడము . ఒక సమూహంగా లెక్కలోకి వస్తాము. ఈ సర్వతోముఖ భారతదేశాన్ని స్థాపించడానికి బాధ్యత వహించాము. ఇదే మా జీవిత ఉద్దేశంగా మారింది. లౌకిక భావన దేశ ఉనికికి అర్ధాన్ని ఇచ్చింది.మరీ ముఖ్యంగా.. చెప్పాలంటే.. ఈ ప్రత్యేకతే మాకు కొత్త గుర్తింపును తీసుకవచ్చింది. అని పేర్కొన్నారు.
ఇండియన్ నేషనల్ ఆర్మీ (INA) ఐక్యంగా పోరాడి నిజమైన జాతీయ శక్తిగా అవతరించింది. 1946లో కోర్టులో INA సైనికులను విచారించినప్పుడు.. ఏఎన్ఏ లో మతపరమైన మార్గాల్లో విభజనను చూస్తూనే ఉంది. కానీ ఏ భారతీయ రాజకీయ సమూహం కూడా ఒక INA సైనికుడి మతపరంగా వేరు చేయలేదు. వారు ఐఎన్ఐకి దూరం కాలేదు. కాంగ్రెస్, ముస్లిం లీగ్, హిందూ మహాసభ, సీపీఐ ఒకదానికొకటి వ్యతిరేకించాయి. INA సైనికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశాయి. ఇది కమ్యూనల్ హార్మోనీ కౌన్సిల్ యొక్క నేతాజీ దార్శనికత యొక్క విజయం. బహుశా ప్రస్తుత ప్రభుత్వం నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క కమ్యూనల్ హార్మోనీ కౌన్సిల్ ఆలోచనకు అంతం లేని మత రాజకీయాలను పరిష్కరించడానికి ఒక షాట్ ఇవ్వాలి.
రచయిత- సాకిబ్ సలీం