
Jaipur : రాజస్థాన్‌లోని జైపూర్ జిల్లా డూడు పట్టణంలోని ఓ బావిలో ముగ్గురు మహిళలు, వారిలో ఇద్దరు గర్భిణులు, ఇద్దరు చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి. తోబుట్టువులయిన ముగ్గురు మహిళలను అత్తమామలు కట్నం డిమాండ్‌తో హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారని indiatoday నివేదించింది.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. జైపూర్ జిల్లా డూడూ పట్టణంలోని ఓ బావిలో శనివారం ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి. హత్యకు గురైన మహిళలను తోబుట్టువులని కలు దేవి, మమత, కమలేష్‌గా గుర్తించారు. ఇద్దరు పిల్లల్లో ఒకరు నాలుగు సంవత్సరాల వయస్సువారు కాగా, మరొకరు కేవలం 27 రోజులు చిన్నారి ఉన్నారు. ఈ ఇద్దరు పిల్లలు కాలు దేవి సంతానంగా గుర్తించారు.
మమతా దేవి, కమలేష్ ఇద్దరూ నిండు గర్భిణులు కావడమే ఈ దారుణ నేర తీవ్రతకు అద్దం పడుతోంది. వారి మృతదేహాలు లభించిన బావి వారి ఇండ్లకు కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. వరకట్నం డిమాండ్‌తో అత్తమామలు వారిని హత్య చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఐదుగురు బుధవారం అదృశ్యమైనప్పటికీ, శనివారం వరకు వారి కోసం వెతకడంలో పోలీసులు విఫలమయ్యారని స్థానిక వర్గాలు తెలిపాయి. అత్తమామలు కొట్టడంతో 15 రోజుల తర్వాత కాలు దేవి ఆసుపత్రిలో చేరిందని స్థానికుడు తెలిపారు. ఆమె కంటికి గాయమైంది.. ఇటీవలే ఆసుపత్రి నుండి తిరిగి వచ్చింది. ఇంతలోనే ఈ ఘోరం జరిగిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు.. విచారణ ప్రారంభించారు.
ఇదిలావుండగా, ఫోన్ కోసం అన్నతమ్ముళ్ల మధ్య గొడవ జరిగింది. క్షణికావేశంలో అన్న తమ్ముడిని రాయితో కొట్టి చంపాడు. మొబైల్ ఫోన్ లో ఆన్‌లైన్ గేమ్ ఆడేందుకు జరిగిన ఈ ఘటన గురించి తెలుసుకుని పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ దారుణ ఘటన గుజరాత్ లో చోటుచేసుకుందని ఎన్‌డీ టీవీ నివేదించింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గుజరాత్‌లోని ఖేడా జిల్లాలో ఆన్‌లైన్ గేమ్ ఆడేందుకు మొబైల్ ఫోన్‌ను పంచుకోవడంపై వారి మధ్య జరిగిన గొడవ జరగింది. ఈ క్రమంలోనే 16 ఏళ్ల బాలుడు తన తమ్ముడిని రాయితో కొట్టి చంపాడు. అంతటితో ఆగకుండా మృత దేహాన్ని బావిలో పడేసినట్లు పోలీసులు గురువారం తెలిపారు. ఈ సంఘటన సోమవారం గోబ్లెజ్ గ్రామంలో జరగగా, మైనర్ నిందితుడిని బుధవారం అదుపులోకి తీసుకున్నట్లు ఖేడా టౌన్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఎస్పీ ప్రజాపతి తెలిపారు.
ప్రాథమిక విచారణ ప్రకారం.. కుటుంబం పొరుగున ఉన్న రాజస్థాన్‌లోని బన్స్వారా జిల్లాకు చెందినదని మరియు గ్రామ శివార్లలోని వ్యవసాయ పొలంలో వ్యవసాయ కూలీలుగా పని చేయడానికి గోబ్లెజ్‌కు వచ్చినట్టు చేప్పారు. అయితే, “మే 23న, అబ్బాయిలు వంతులవారీగా మొబైల్ ఫోన్‌లో గేమ్ ఆడుతున్నప్పుడు, నిందితుడు తన వంతు వచ్చినప్పుడు పరికరాన్ని ఇవ్వడానికి నిరాకరించిన అతని 11 ఏళ్ల సోదరుడితో గొడవపడ్డాడు. ఆవేశంతో యువకుడు తన తమ్ముడి తలపై పెద్ద రాయితో కొట్టాడు" అని ప్రజాపతి తెలిపారు. అతను స్పృహ తప్పి పడిపోయిన తర్వాత, యువకుడు తీగతో బాధితుడికి రాయిని కట్టి, ఎవరూ లేని సమయంలో సమీపంలోని బావిలో పడేశాడని పోలీసులు తెలిపారు.