
తన జ్యువెలరీ షాప్ లో పని చేసే ఉద్యోగులకు కళ్లు చెదిరే బహుమతులు అందించాడు ఆ యజమాని. దీపావళి సందర్భంగా 1.2 కోట్లు ఖర్చు చేసి కార్లు, బైక్ లు కొనుగోలు చేసి వారికి బహుమతులుగా అందించారు. చెన్నైకి చెందిన జ్యువెలరీ షాప్ యజమాని జయంతి లాల్ తన ఉదారత ప్రదర్శించారు. భారీ కానుకలతో తన సిబ్బందిని ఆశ్చర్యానికి గురి చేశారు.
ఖర్గే వర్సెస్ థరూర్.. నేడే కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు.. గెలిచేదెవరు ?
ఆ వ్యాపారవేత్త తన ఉద్యోగుల పట్ల చూపిన అసాధారణమైన దయ నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఆయనను ప్రశంసలు కురిపిస్తు కామెంట్స్ చేస్తున్నారు. వార్తా సంస్థ ఏఎన్ఐ నివేదికల ప్రకారం.. తమ యజమాని ఇలా కానుకలు ఇవ్వడంతో చలానీ జ్యువెలరీ సిబ్బంది ఎంతో ఆశ్చర్యానికి గురయ్యారు. ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. యజమాని తన సిబ్బందికి మొత్తంగా 10 కార్లు, 20 బైక్‌లను బహుమతిగా ఇచ్చారు.
రూ. 30 కోట్ల విలువైన రెండున్నర కేజీల పాము విషం స్మగ్లింగ్..ఎక్కడంటే..
ఈ సందర్భంగా జయంతి మాట్లాడుతూ.. తన సిబ్బంది మరింత పని చేయడానికి. వారు జీవితంలో ప్రత్యేకత ఉండటానికి ఇది తోడ్పడుతుందని చెప్పారు. వారు వ్యాపారంలో హెచ్చు తగ్గుల సమయంలో కూడా తనతో కలిసి పని చేశారని తెలిపారు. లాభాలు సంపాదించడంలో సహాయపడ్డారని పేర్కొన్నారు.
‘‘ వారు కేవలం సిబ్బంది మాత్రమే కాదు. వారు నా కుటుంబం. కాబట్టి వారికి అలాంటి సర్ ప్రైజ్‌లు ఇచ్చి వారిని నా కుటుంబ సభ్యుల్లాగే చూడాలనుకున్నాను. కానుకలు ఇచ్చిన తరువాత నేను మరింత సంతోషంగా ఉన్నాను. ప్రతీ యజమాని వారి సిబ్బందిని, సహోద్యోగులకు బహుమతులు ఇచ్చి గౌరవించాలి ’’ అని ఆయన తెలిపారు. కాగా.. ఈ ఏడాది దీపావళి అక్టోబర్ 24 సోమవారం జరుపుకోనున్నారు.
భారీ మొత్తంలో టోల్ వసూలు కేంద్రం సిద్దం
ఉద్యోగులకు ఖరీదైన కార్లు, బైకులు ఇచ్చి సర్ ప్రైజ్ కు గురి చేశారు తమిళనాడులోని ఓ జ్యువెలరీ షాప్ యజమాని. ఆయన అందించిన బహుమతులు చూసి ఉద్యోగులు ఎంతో ఆనందపడ్డారు.