దీపావళి కాళరాత్రి... వృద్ధదంపతులను కిరాతకంగా కొట్టి చంపిన దుండగులు, ఇంట్లో సోదాలు.. !

By AN TeluguFirst Published Nov 6, 2021, 8:59 AM IST
Highlights

దీపావళి రోజు శుక్రవారం ((నవంబర్ 5) రాత్రి ఘజియాబాద్‌లోని పటేల్ నగర్‌లో నివసిస్తున్న వృద్ధ దంపతులిద్దరు వారి ఇంట్లోనే brutally murderedకు గురయ్యారు. హత్య చేయడానికి ముందు వారిని అతి కిరాతకంగా కొట్టి మరీ చంపినట్లు  పోలీసులు తెలిపారు. 

ఘజియాబాద్ : ఉత్తరప్రదేశ్ లోని ఓ జంటకు దీపావళి కాళరాత్రిగా మారింది. వృద్ధ దంపతుల పాలిట కర్కశంగా మారింది. అందరూ సంతోషంగా దీపాలు వెలిగించి, పటాకులు కాల్చుకుని సంబరాలు జరుపుకుంటుంటే.. వారు మాత్రం నరకయాతన అనుభవించారు. 

దీపావళి రోజు శుక్రవారం ((నవంబర్ 5) రాత్రి ఘజియాబాద్‌లోని పటేల్ నగర్‌లో నివసిస్తున్న వృద్ధ దంపతులిద్దరు వారి ఇంట్లోనే brutally murderedకు గురయ్యారు. హత్య చేయడానికి ముందు వారిని అతి కిరాతకంగా కొట్టి మరీ చంపినట్లు  పోలీసులు తెలిపారు. 

ఘజియాబాద్ లో దంపతులిద్దరూ ఒంటరిగా ఉంటున్నారు. వీరి కుమార్తెలో నోయిడాలో నివసిస్తున్నారు. కూతుర్లలో ఒకరు తల్లిదండ్రులకు ఫోన్ చేస్తే వారు ఎత్తలేదు. అలా చాలాసార్లు ఫోన్లు చేసినా వారినుంచి స్పందన లేదు. దీంతో కంగారు పడిన కూతురు. తల్లిదండ్రుల పక్కింటి వారికి ఫోన్ చేసి.. ఒకసారి ఏం జరిగిందో చూడమని అభ్యర్థించింది. 

వెంటను ఇరుగుపొరుగు వారు... ఇంటికి వెళ్లి చూడగా జరిగిన దారుణం వెలుగులోకి వచ్చింది. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అని సిటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (II) నిపున్ అగర్వాల్ తెలిపారు.

కుమార్తె ఫోన్ కాల్ తో ఇరుగు పొరుగు వారు దంపతుల నివాసానికి చేరుకునే సరికి.. వారింటి తలుపులు తెరిచి ఉన్నాయని.. 72 ఏళ్ల medicine dealer అశోక్ జైద్కా, అతని భార్య మధు జైద్కా మృతదేహాలు ఇంటి లోపల రక్తపు మడుగులో పడి ఉన్నాయని ఆయన తెలిపారు. 

మూఢనమ్మకం : పవిత్ర జలం, మతగ్రంథం.. జ్వరం తగ్గిస్తుందని చెప్పి.. బాలిక ఉసురు తీశారు....

అది చూసి షాక్ అయిన ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారని.. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను post mortem నిమిత్తం తరలించినట్లు ఎస్పీ తెలిపారు. దీపావళి రోజు రాత్రి 9 గంటల సమయంలో దంపతులు blunt objectతో కొట్టి చంపారని అగర్వాల్ తెలిపారు.

అయితే, హత్య చేసిన నిందితులు.. ఇంట్లోని అల్మీరాలో ఉన్న ఆభరణాలు, నగదులను ముట్టలేదని.. అవి చెక్కుచెదరకుండా ఉన్నాయని తెలిపారు. కాకపోతే.. గదిలో బట్టలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయని సీన్ గురించి తెలిపారు. దీంతో.. దుండగులు నగలు, డబ్బులు కోసం old couple ని చంపకపోయి ఉండొచ్చని.. ఇంట్లో దేనికోసమే సోదాలు చేశారని, వారి ఉద్దేశం దోపిడీ కాదని ప్రాథమికంగా భావిస్తున్నామని ఎస్పీ తెలిపారు. 

కాగా, స్థానికంగా కలకలం రేపిన ఈ హత్యల మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు అనేక కోణాల్లో పనిచేస్తున్నారు. నగదు, నగలు ముట్టకపోవడం.. బట్టలు చిందరవందరగా ఉండడంవల్ల ఏదైనా అనుమానాస్పదమైన విషయంలో వృద్ధదంపతులు ఇరుక్కున్నారా? లేక వీరికి అంతకు ముందు పాతకక్షలేవైనా ఉన్నాయా? ఎందుకు చంపాల్సి వచ్చింది? అత్యంత దారుణంగా కొట్టి మరీ చంపేంత కసి ఏంటి? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని.. మీరట్ రేంజ్ ఐజీ ప్రవీణ్ కుమార్ కూడా సంఘటనా స్థలాన్ని సందర్శించారని తెలిపారు.ఘటనా స్తలానికి చేరుకున్న కూతుర్లు హృదయవిదారకంగా ఏడవడం అందరినీ కలిచి వేస్తోంది. 

click me!