వివాహేతర సంబంధం : హత్య చేసి, శవాన్ని కాల్చి, మాయం చేసి... చివరికి ‘చెప్పు’ వల్ల దొరికిపోయి....

Published : Nov 06, 2021, 08:02 AM IST
వివాహేతర సంబంధం : హత్య చేసి, శవాన్ని కాల్చి, మాయం చేసి... చివరికి ‘చెప్పు’ వల్ల దొరికిపోయి....

సారాంశం

పుణెలో ఓ వ్యక్తి మాయమయ్యాడు. అతని కోసం దాదాపు పదిహేను రోజులుగా కేసు ఛేదించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు పోలీసులు.  ఈ క్రమంలో వారికి దొరికిన ‘foot ware’ కేసును పరిష్కరించింది.  accussedలను పట్టించింది.  ఈ సంఘటన పుణెలో చోటు చేసుకుంది. 

ముంబై :  ఓ వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఆచూకీ దొరకలేదు. ఎంత ప్రయత్నించినా.. ఏ చిన్న క్లూ కూడా దొరకలేదు. అయితే ఎంత పకడ్బందీగా నేరం చేసినా నిందితుడు ఏదో ఒక చిన్న తప్పు చేస్తాడు. ఆ తప్పును పట్టుకోగలిగితే.. నేరం మిస్టరీ వీడిపోతుంది. అదే చేశారు పోలీసులు.

వ్యక్తి missing caseలో.. కాదేది అనుమానానికి అనర్హం.. అన్నట్టుగా  ఓ చెప్పును అనుమానించారు. అదే వారికి కేసు పరిష్కారానికి దారి చూపించింది. అలా ఓ వ్యక్తి హత్యకు దారితీసిన వివాహేతర సంబంధం బయటపడింది.  

పుణెలో ఓ వ్యక్తి మాయమయ్యాడు. అతని కోసం దాదాపు పదిహేను రోజులుగా కేసు ఛేదించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు పోలీసులు.  ఈ క్రమంలో వారికి దొరికిన ‘foot ware’ కేసును పరిష్కరించింది.  accussedలను పట్టించింది.  ఈ సంఘటన పుణెలో చోటు చేసుకుంది.  ఆ వివరాలు…

బవ్థాన్  ప్రాంతానికి చెందిన  27 ఏళ్ల వ్యక్తి 2021, అక్టోబర్ 22 నుంచి కనిపించకుండా పోయాడు. ఈ క్రమంలో అతని తల్లి దీని గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు  కిడ్నాప్  సహా పలు యాంగిల్స్ లో దర్యాప్తు కొనసాగించారు.  ఈ క్రమంలో పోలీసులకు తప్పిపోయిన వ్యక్తి చెప్పు... ఓ ఇంటిముందు కనిపించింది.

ఆ ఇంట్లో ఉంటున్న వ్యక్తిని స్టేషన్ కు పిలిపించారు పోలీసులు. దర్యాప్తులో పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. తప్పిపోయిన వ్యక్తిని  సదరు  ఇంటి owner హత్య చేశానని తెలిపాడు. murder చేసేంత కోపం ఏంటని ఆరా తీయగా.. హత్యచేయబడిన వ్యక్తికి... తన భార్యతో extra marital affair ఉందని...  అందుకే అతనిని  చంపేశానని తెలిపాడు.

అక్టోబర్ 21న చనిపోయిన వ్యక్తి మొబైల్ నెంబర్ నుంచి తన wifeకు రెండు మిస్డ్ కాల్స్ వచ్చాయని తెలిపాడు నిందితుడు.  అంతేకాక అదే రోజు రాత్రి victim తన ఇంటికి వచ్చి తన భార్యను కలిశాడని వెల్లడించాడు.  వారి బంధం గురించి తెలిసిన మరో ఇద్దరి సహాయంతో బాధితుడిని హత్య చేశాడు.  కత్తితో పొడిచి చంపాడు.  ఆ తరువాత deadbodyని తగలబెట్టాడు.  ప్రస్తుతం పోలీసులు ఇద్దరిని అరెస్టు చేయగా... మరో వ్యక్తిని మధ్యప్రదేశ్లో అదుపులోకి తీసుకున్నారు. 

భార్యపై అనుమానం.. ఎనిమిదేళ్ల కూతురి గొంతు కోసి చంపిన తండ్రి...

వివాహేతర సంబంధాలు ఇలాంటి దారుణాలకే దారి తీస్తాయి. ఇలాంటివి రోజుకో సంఘటన బయటపడుతున్నా... కేసుల్లో తగ్గుదల మాత్రం కనిపించడం లేదు. 

కాగా, చెన్నైలో ఓ వ్యక్తి.. భార్యమీద అనుమానంతో కన్న కూతురిని గొంతుకోసి హత్య చేశాడు. తల్లి గురించి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకపోవడంతో ఓ వ్యక్తి తన కుమార్తెను గొంతు నులిమి హత్య చేసిన ఘటన శనివారం రాత్రి విల్లివాక్కంలో చోటుచేసుకుంది.

నిందితుడు, విల్లివాక్కంకు చెందిన 34 ఏళ్ల రాధాకృష్ణన్ కు కొన్నేళ్ల క్రితం లావణ్య(30)ను వివాహం చేసుకున్నాడు. ఆమె నర్సుగా పనిచేస్తోంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరిద్దరిదీ Love marriage అని పోలీసులు తెలిపారు.

 

PREV
click me!

Recommended Stories

Indian Army Romeo Force Destroys: గడ్డ కట్టే మంచులో మన ఇండియన్ ఆర్మీ| Asianet News Telugu
Tourists Enjoy New Year’s First Snow in Chamba: మంచు కొండల్లో న్యూఇయర్ వేడుకలు | Asianet News Telugu