మూఢనమ్మకం : పవిత్ర జలం, మతగ్రంథం.. జ్వరం తగ్గిస్తుందని చెప్పి.. బాలిక ఉసురు తీశారు....

By AN TeluguFirst Published Nov 6, 2021, 8:30 AM IST
Highlights

జ్వరం తగ్గిపోతుందని, ఎట్టిపరిస్థితుల్లోనూ ఆసుపత్రికి తీసుకెళ్లొద్దని సూచించాడు. అతడి మాటలను విశ్వసించిన తండ్రి, కళ్లముందే  కుమార్తె జ్వరంతో విలవిల్లాడుతున్నా పట్టించుకోలేదు. దీంతో పరిస్థితి విషమించడంతో ఆమె మృతి చెందింది.

కన్నూరు :  జ్వరంతో బాధపడుతున్న బాలికను ఆసుపత్రికి తీసుకెళ్ళ వద్దంటూ మంత్ర  జలం ఇచ్చి,  ఖురాన్ చదవమన్నాడో మతపెద్ద. అతడి మాటలు నమ్మి అలాగే చేసిన ఆ తల్లిదండ్రులు కుమార్తె విల్లవిల్లాడుతున్నా.. ఆస్పత్రికి తీసుకువెళ్లలేదు. ఫలితంగా ఆ చిన్నారి మరణించింది. కేరళలోని కన్నూరులో జరిగిందీ ఈ సంఘటన.

పోలీసుల కథనం ప్రకారం.. పదకొండేళ్ల బాలిక high feverతో బాధపడుతుండడంతో తండ్రి అబ్దుల్ సత్తారు (55) ఆమెను స్థానిక ఇమామ్ మహ్మద్ ఉవైజ్  (30) వద్దకు తీసుకెళ్లాడు. ఆమెను చూసిన ఇమామ్ Holy waterపేరుతో నీళ్లు ఇచ్చి, ఖురాన్ చదవమని చెప్పాడు.

అంతేకాదు, జ్వరం తగ్గిపోతుందని, ఎట్టిపరిస్థితుల్లోనూ ఆసుపత్రికి తీసుకెళ్లొద్దని సూచించాడు. అతడి మాటలను విశ్వసించిన తండ్రి, కళ్లముందే  కుమార్తె జ్వరంతో విలవిల్లాడుతున్నా పట్టించుకోలేదు. దీంతో పరిస్థితి విషమించడంతో ఆమె మృతి చెందింది.

బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లకుండా బాధిత కుటుంబ సభ్యులను Imam ఒప్పించినట్టు అతడి బంధువే పోలీసులకు తెలిపింది. అంతేకాదు, గతంలోనూ ఇలాగే చెప్పి నలుగురి deathకి కారణమైనట్టు పోలీసులు గుర్తించనట్టు కన్నూరు జిల్లా పోలీస్ చీఫ్ ఇళంగో ఆర్ తెలిపారు. 

చికిత్స తీసుకోని కారణంగా తమ కుటుంబంలో 2014, 2016, 2018లో ముగ్గురు కుటుంబ సభ్యులు మరణంచినట్టు బాలిక తండ్రి సోదరుడు పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక తండ్రి అబ్దుల్ సత్తార్, ఇమామ్ లను అరెస్ట్ చేశారు. 

వివాహేతర సంబంధం : హత్య చేసి, శవాన్ని కాల్చి, మాయం చేసి... చివరికి ‘చెప్పు’ వల్ల దొరికిపోయి....

బాలిక మృతి మిస్టరీ...

నాలుగైదేళ్ల వయసున్న బాలిక అనుమానాస్పదస్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. పంజాగుట్ట పోలీసుల కథనం ప్రకారం దీపావళి రోజు (గురువారం) ఉదయం జేవీఆర్ పార్కు ఎదుట ద్వారకపురి కాలనీలోని  మూసిఉన్న దుకాణం ఎదుట బాలిక అచేతనంగా పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీస్ కంట్రోల్ రూమ్ కు సమాచారం ఇచ్చారు.

పంజాగుట్ట పోలీసులు dead bodyని పరిశీలించారు.  బాలిక పడి ఉన్నచోట రక్తపు మరకలు లేకపోవడంతో ఘటన ఇక్కడ జరగలేదని నిర్ధారణకు వచ్చారు.  ఎక్కడో murder చేసి, గుట్టుచప్పుడు కాకుండా ఇక్కడ పడేసి ఉంటారని అనుమానంతో సమీపంలోని దాదాపు వందకుపైగా కెమెరాల ఫుటేజీని పరిశీలించినా ఎలాంటి పురోగతి కనిపించలేదు.  

child మృతదేహంపై పాత గాయాలున్నాయని,  అత్యాచారం జరిగిన దాఖలాలు లేవని పశ్చిమ మండలం జాయింట్ కమిషనర్ ఏ ఆర్ శ్రీనివాస్ శుక్రవారం వెల్లడించారు. *రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా missing case వివరాలు పరిశీలిస్తున్నాం? పోస్టుమార్టం నివేదిక ఆధారంగా... బాలిక ఎప్పుడు? ఎలా మరణించింది? శరీరంపై ఇంకా ఏమైనా గాయాలు ఉన్నాయా? అనేది తెలుస్తుంది. రెండు రోజుల్లో నిందితులను గుర్తిస్తాం.’ అని ఆయన తెలిపారు.

 రాష్ట్రంలోని అన్నిఠాణాలతో పాటు... సామాజిక మాధ్యమాల్లో బాలిక చిత్రాన్ని విడుదల చేసినట్టు చెప్పారు.  బాలిక గురించి సమాచారం తెలిస్తే ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి (9490616610),  డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ నాగయ్య(9490616613), ఎస్సై సతీష్ (9490616365)లకు తెలియజేయాలని కోరారు. క్షుద్రపూజల కోసం ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

click me!