సంక్రాంతి బంపర్ ఆఫర్... మెట్రో రైళ్ల టికెట్ ఛార్జ్ తగ్గింపు

Published : Jan 13, 2020, 07:49 AM IST
సంక్రాంతి బంపర్ ఆఫర్... మెట్రో రైళ్ల టికెట్ ఛార్జ్ తగ్గింపు

సారాంశం

ఆదివారం, ప్రభుత్వ సెలవు దినాల్లో చార్జీల్లో 50 శాతం రాయితీని ప్రకటించారు. ప్రస్తుతం పొంగల్‌ పండుగను పురస్కరించుకుని ఈ నెల 15, 16, 17 తేదీలు ప్రభుత్వ సెలవు దినాలు కావడంతో ఆ మూడు రోజులు 50 శాతం రాయితీతో ప్రయాణించవచ్చు.   

సంక్రాంతి పండగ సందర్భంగా మెట్రో బంపర్ ఆఫర్ ఇచ్చింది.  మెట్రో రైళ్లలో 50 శాతం రాయితీ టికెట్ రుసుముతో ప్రయాణం చేయవచ్చని చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ తెలియజేసింది. ఈ మేరకు ఆ సంస్థ విడుదల చేసిన ప్రకటనలో... నగరంలో ట్రాఫిక్‌ రద్దీని నియంత్రించేలా ఏర్పాటుచేసిన మెట్రోరైళ్లలో ప్రయాణికులను ఆకట్టుకునేలా సీఎంఆర్‌ఎల్‌ పలు చర్యలు చేపట్టింది. 

ఇందులో భాగంగా, ఆదివారం, ప్రభుత్వ సెలవు దినాల్లో చార్జీల్లో 50 శాతం రాయితీని ప్రకటించారు. ప్రస్తుతం పొంగల్‌ పండుగను పురస్కరించుకుని ఈ నెల 15, 16, 17 తేదీలు ప్రభుత్వ సెలవు దినాలు కావడంతో ఆ మూడు రోజులు 50 శాతం రాయితీతో ప్రయాణించవచ్చు. 

Also Read ఫ్యాక్టరీలో పేలుడు: ఐదుగురు మృతి, ఆరుగురి పరిస్థితి విషమం.

17వ తేదీ కానుమ్‌ పొంగల్‌ సందర్భంగా చెన్నై మెరీనా బీచ్‌ నుంచి మెట్రో రైల్వేస్టేషన్లకు ప్రత్యేక క్యాబ్‌ వసతి ఏర్పాటుచేసింది. అలాగే, ప్రభుత్వ ఎస్టేట్‌, డీఎంఎస్‌ మెట్రో రైల్లేస్టేషన్ల నుంచి మెరీనా బీచ్‌కు క్యాబ్‌ వసతి కల్పించనున్నట్లు సీఎంఆర్‌ఎల్‌ తెలియజేసింది.

PREV
click me!

Recommended Stories

Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?
Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?