ప్రధాని మోడీ తో మమత బెనర్జీ భేటీ: ఎన్ఆర్‌సీ, సీఏఏ లను ఉపసంహరించమని కోరిన దీది

By telugu teamFirst Published Jan 11, 2020, 5:14 PM IST
Highlights

చట్టాలను అనేక రాష్ట్ర ప్రభుతవలు వ్యతిరేకిస్తుండగా... తీవ్రస్థాయిలో వీటిని వ్యతిరేకిస్తూ, నిరసనలను దగ్గరుండి  మరీ కేంద్రానికి తెలియచేస్తున్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే... అది ఖచ్చితంగా బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ యే! 

కోల్కతా:  దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ పిఆర్, ఎన్నార్సి ల పై తీవ్ర స్థాయిలో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ నిరసనల్లో అనుకోకుండా హింస కూడా చెలరేగింది. ఇది చాలా దురదృష్టకరమైన చర్య. 

ఈ చట్టాలను అనేక రాష్ట్ర ప్రభుతవలు వ్యతిరేకిస్తుండగా... తీవ్రస్థాయిలో వీటిని వ్యతిరేకిస్తూ, నిరసనలను దగ్గరుండి  మరీ కేంద్రానికి తెలియచేస్తున్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే... అది ఖచ్చితంగా బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ యే! 

ఆమె ఈవిషయమై నేడు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఆమె ఈ చట్టాలను ఉపసంహరించమని ప్రధానిని కోరారు. కోల్కతా పోర్ట్ ట్రస్ట్ 150 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మోడీ కోల్కతా విచ్చేసారు. విద్యార్థులు నిరసనల నేపథ్యంలో నగరంలో భద్రతను కట్టుదిట్టం చేసారు. 

కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఈ చట్టాన్నివ్యతిరేకిస్తే తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో మైనారిటీ ప్రజలు కదం తొక్కారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుండి భారీ ర్యాలీలు చేపట్టిన మైనార్టీ ప్రజలు ధర్నా చౌక్ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు.

నిరసనకారులు భారీ ఎత్తున తరలిరావడంతో లోయర్ ట్యాంక్ బండ్ ప్రాంతమంతా జనసంద్రమయ్యింది. ముఖ్యంగా నాంపల్లి, ఆర్టీసి క్రాస్ రోడ్స్, హిమాయత్ నగర్,  నెక్లస్ రోడ్, ట్యాంక్ బండ్ ప్రాంతాల్లో భారీ ఎత్తును ర్యాలీ కొనసాగింది. అలాగే మెహిదీపట్నంలో కూడా భారీ ఎత్తును మైనారిటీ  ప్రజలు రోడ్డుపైకి వచ్చి సీఏఏ, ఎన్నార్సీ, ఎన్‌పీఆర్‌ లకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. 

దేశ ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. అలాగే ఎన్‌ఆర్సీకి వ్యతిరేకంగా కూడా నినాదాలు చేశారు. దీంతో ధర్నా చౌక్ ప్రాంతం బిజెపి, కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక  నినాదాలతో దద్దరిల్లింది. 

 

click me!