ఫ్యాక్టరీలో పేలుడు: ఐదుగురు మృతి, ఆరుగురి పరిస్థితి విషమం

Published : Jan 12, 2020, 07:48 AM ISTUpdated : Jan 12, 2020, 07:53 AM IST
ఫ్యాక్టరీలో పేలుడు: ఐదుగురు మృతి, ఆరుగురి పరిస్థితి విషమం

సారాంశం

మహారాష్ట్రలో ఓ ఫ్యాక్టరీలో  ఘోర ప్రమాదం చోటు చేసుకొంది.ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. ఆరుగురు గాయపడ్డారు. 

ముంబై: మహారాష్ట్రలో ఓ ఫ్యాక్టరీలో పేలుడు చోటు చేసుకొంది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు కారణంగా ఈ ప్రమాదం వాటిల్లింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

మహారాష్ట్రలోని పాల్గార్ జిల్లా బాయిసర్ లోని ఓ ఫ్యాక్టరీలో శనివారం రాత్రి పేలుడు సంభవించింది ఈ పేలుడులో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.ఈ పేలుడు ధాటికి సమీపంలోని కొన్ని ఇళ్ల కిటికీలు కూడా దెబ్బతిన్నాయి.

ఓ కెమికల్ ఫ్యాక్టరీలో కొత్త  కొత్త రియాక్టర్‌ను పరిశీలిస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో భారీగా మంటలు వ్యాపించాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఫైర్ పైటర్లు మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. 

 ఈ ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు 5లక్షల పరిహారం అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు సహాయక చర్యలు ముఖ్యమంత్రి పర్యవేక్షిస్తున్నారు క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని సీఎం ఆదేశించారు 

PREV
click me!

Recommended Stories

అరెస్ట్ అయిన కొన్ని గంటల్లోనే Udayanidhi Stalin విడుదల | Udhayanidhi Stalin Released Within Hours
Udhayanidhi Stalin Speech Controversy: తమిళ రాజకీయాల్లో డబుల్ మీనింగ్ డైలాగ్ ల రచ్చ | Asianet Telugu