33 యేళ్ల క్రితం అదృశ్యమై.. 75యేళ్ల వయసులో ఇంటికి.. ఎక్కడికి వెళ్లాడటా అంటే..

By SumaBala BukkaFirst Published Jun 2, 2023, 7:44 AM IST
Highlights

42యేళ్ల వయసులో కనిపించకుండా పోయిన ఓ వ్యక్తి.. 33యేళ్ల తరువాత 75యేళ్ళ వయసులో.. ఇంటికి చేరుకున్నాడు. అతను చనిపోయాడనుకున్న కుటుంబసభ్యులు  అతన్ని చూసి ఆశ్యర్యపోయారు. 

రాజస్థాన్ : ఎవరైనా కనిపించకుండా పోతే.. రోజులు, నెలలు.. ఒకటి రెండు సంవత్సరాల పాటు ఎదురుచూసి వారిక మనకు లేరనుకోవడం మామూలుగా చూస్తుంటాం. నేటి రోజుల్లో ఇలా కనిపించకుండా పోయిన వ్యక్తులు.. అనేక రకాల మాఫియాలు, ట్రాఫికర్ల చేతుల్లో పడి.. ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు  వింటున్నాం. ఈ క్రమంలో  ఓ వ్యక్తి అదృశ్యమైన 33 సంవత్సరాల తర్వాత తిరిగి తన కుటుంబాన్ని చేరాడు. దీంతో ఈ వార్త చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన రాజస్థాన్లోని  అల్వార్ జిల్లాలో వెలుగు చూసింది.

దీనికి సంబంధించిన వివరాలలోకి వెళితే..  33 ఏళ్ల క్రితం 42 ఏళ్ల వయసులో ఓ వ్యక్తి కనిపించకుండా పోయాడు. అతను ప్రస్తుతం 75 ఏళ్ల వయసులో ఇంటికి తిరిగివచ్చాడు. అతని పేరు హనుమాన్ సైనీ (75). రాజస్థాన్లోని అల్వార్ జిల్లా బన్సూర్ గ్రామానికి చెందిన వ్యక్తి. 1989లో ఢిల్లీలోని ఓ దుకాణంలో పనిచేయడానికి వెళ్ళాడు. అదే సంవత్సరం..  ఎవరికీ చెప్పకుండా తాను పనిచేస్తున్న ఢిల్లీ నుంచి హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రాకు వెళ్లిపోయాడు. 

విద్యార్థినులతో బలవంతంగా హిజాబ్.. వైరల్ అవుతున్న స్కూల్ పోస్టర్.. విచారణకు ఆదేశాలు..

కుటుంబ సభ్యులను ఆ తర్వాత ఎప్పుడు సంప్రదించలేదు. కంగ్రాలో ఉన్న మాతా మందిరంలో పూజలు చేస్తూ ఉండిపోయాడు. అలా దాదాపు 33 సంవత్సరాలు, ఇంటికి, కుటుంబ సభ్యులకు దూరంగా మందిరంలో గడిపాడు. ఆ తర్వాత అక్కడి నుంచి ఢిల్లీకి వచ్చాడు. ఢిల్లీ నుంచి స్వగ్రామమైన బన్సర్ వరకు చేరుకున్నాడు. అయితే, అతని కోసం అప్పటికే చాలా ఏళ్లు ఎదురుచూసిన కుటుంబ సభ్యులు.. సైనీ చనిపోయి ఉంటాడని నిర్ధారించుకుని నిరుడే అతని మరణ ధ్రువీకరణ పత్రాన్ని కూడా తీసుకున్నారు.

ఈ క్రమంలో హఠాత్తుగా  75 ఏళ్ల వయసు సైనీ స్వగ్రామానికి తిరిగి రావడంతో..అందరూ ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఆనందంలో మునిగిపోయారు. 33 ఏళ్ల తర్వాత అతనిని చూసిన ఆనందంలో అతని కుటుంబంలోని చిన్న పెద్దా సంబరాలు చేసుకున్నారు.ఇంతకీ అతను ఎందుకు అలా వెళ్ళిపోయాడని విషయం మాత్రం తెలియ రాలేదు.  

click me!