రాజస్థాన్ సీఎం పీఠం విషయంలో పార్టీ హైకమాండ్, అశోక్ గెహ్లాట్‌తో మాట్లాడలేదు - సచిన్ పైలెట్

By team teluguFirst Published Sep 27, 2022, 4:15 PM IST
Highlights

రాజస్థాన్ సీఎం పదవి విషయంలో తాను అశోక్ గెహ్లాట్, కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించలేదని ఆ పార్టీ నాయకుడు సచిన్ పైలెట్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

రాజస్థాన్‌లో సీఎం పదవి విషయంలో పార్టీ హైకమాండ్‌తో మాట్లాడానన్న వాదనలను కాంగ్రెస్ ఎమ్మెల్యే సచిన్ పైలట్ మంగళవారం తోసిపుచ్చారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనే నిర్ణయాన్ని, సీఎంగా మారే అవకాశంపై తాను పార్టీ హైకమాండ్‌తో కానీ, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌తో కానీ మాట్లాడలేదని పైలట్ చెప్పారు.

ఆన్‌లైన్ గేమ్స్ యాప్‌లపై ఈడీ కొరడా.. రూ. 68 కోట్లు ఫ్రీజ్.. వెలుగులోకి సంచలన విషయాలు..

రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకుంటే సీఎం పదవిలో కొనసాగకూడదని పైలట్ న్యూఢిల్లీలో పార్టీ హైకమాండ్‌కు చెప్పినట్లు గతంలో వార్తలు వచ్చాయి. కాగా.. పైలట్ కు ఎమ్మెల్యేలకు మద్దతు ఇవ్వడమే కాకుండా ఇతర ఎమ్మెల్యేలతో ఆయ‌న నిరంతరం టచ్‌లో ఉన్నారని కూడా నివేదికలు పేర్కొన్నాయి. హైకమాండ్ నిర్ణయం కోసం వేచి ఉండాల్సిందిగా ఆయన తన మద్దతుదారులను కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 

ఇదిలా ఉండగా.. సీఎం పదవి కోసం సచిన్ పైలట్‌కు మద్దతు ఇస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంగళవారం జైపూర్‌లోని ఆయన నివాసానికి చేరుకున్నారు, అయితే ఆయన శిబిరంలో జరుగుతున్న పరిణామాలపై మాత్రం పైలెట్ పెదవి విప్పలేదు.

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి 30న శశిథరూర్ నామినేషన్.. ప్రత్యర్థి వివరాలు ఇంకా మిస్టరీనే

ఈ పరిణామాలపై ఎమ్మెల్యే ఖిలాడీ లాల్ బైర్వా మీడియాతో మాట్లాడుతూ.. 2023 ఎన్నికల కోసం పార్టీ అగ్ర నాయకత్వం సంస్థను పునర్నిర్మిస్తున్నదని, రాజస్థాన్ ముఖ్యమంత్రి ఎవ‌ర‌నేది నిర్ణ‌యించేది వారేన‌ని చెప్పారు. అయితే కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేస్తాన‌ని చెప్పిన గెహ్లాట్, రాజస్థాన్‌లో తాను నిర్ణ‌యించిన వ్య‌క్తే సీఎం కావాల‌ని డిమాండ్ చేశారు. ఈ నేప‌థ్యంలో రాజ‌స్థాన్ లో రాజ‌కీయ గంద‌ర‌గోళం ఏర్ప‌డింది.

పంజాబ్ లో పొలిటిక‌ల్ హీట్.. అసెంబ్లీలో విశ్వాస తీర్మానం పెట్టిన భ‌గ‌వంత్ మాన్

‘‘ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకు చేసిన పనిని మేము కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి వివరించాం. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరుగుతాయి. ఇప్పటి వరకు శశి థరూర్, పవన్ బన్సాల్ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.’’ అని కేంద్ర ఎన్నిక‌ల సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్ ఎం మిస్త్రీ మంగ‌ళ‌వారం మీడియాతో తెలిపారు. 
 

click me!