ధెంగ్రే ఒక లేబర్ కాంట్రాక్టర్ ద్వారా వీరిద్దరిని నెల రోజుల క్రితమే పనిలో పెట్టుకున్నాడు. అప్పుడే బోనస్ అడగడంతో మరోసారి ఇస్తానని చెప్పాడు.
మహారాష్ట్ర : దీపావళి బోనస్ ఇవ్వలేదని నాగ్‌పూర్‌లోని ఒక దాబా యజమానిని ఇద్దరు కార్మికులు దారుణంగా హత్య చేశారు. బాధితుడు, రాజు ధెంగ్రేగా గుర్తించారు. నిందితులు అతడిని గొంతు కోసి, కత్తితో పొడిచి, కొట్టి చంపారు. హత్యానంతరం దుండగులు అక్కడినుంచి పరారయ్యారు. ఈ హత్యపై రాజకీయ పరమైన శతృత్వంతోపాటు పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటన శనివారం తెల్లవారుజామున మహారాష్ట్రలోని నాగ్ పూర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కుహి ఫటా దగ్గర్లోని దాబాలో వెలుగు చూసింది. ధెంగ్రే కుటుంబం గ్రామంలో పరపతి ఉంది. రాజకీయంగా పరిచయాలున్నాయి. బిజెపికి మద్దతుదారుడిగా ఉన్నాడు. హత్యానంతరం దుండగులు ధెంగ్రే కారుతో పారిపోయారు.
undefined
వివరాల్లోకి వెడితే.. శనివారం తెల్లవారుజామున నాగ్‌పూర్ రూరల్ పోలీస్ ఏరియాలోని కుహి ఫాటా సమీపంలోని ఓ దాబా యజమానిని అతని దగ్గర పనిచేసే ఇద్దరు కార్మికులు గొంతు కోసి, కత్తితో పొడిచి, కొట్టి చంపారు. దీపావళి బోనస్ అడిగితే, ఇప్పుడు కాదు మరోసారి ఇస్తానని చెప్పడంతో హత్యకు దారితీసిందని సమాచారం. నిందితులు పరారీలో ఉన్నారు.
ధెంగ్రే కుహి తాలూకాలోని సుర్గావ్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచాడు. డబ్బుల కోసం జరిగిన హత్యగా అనిపిస్తోందని, అయితే దీని వెనకున్న "రాజకీయ ప్రత్యర్థి కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నాం" అని ఎస్పీ హర్ష్ ఎ పొద్దార్ చెప్పారు. వివిధ కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.
దుండగులు మధ్యప్రదేశ్‌లోని మాండ్లాకు చెందిన చోటూ, ఆదిగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ధెంగ్రే నగరంలోని మధ్యప్రదేశ్ రాష్ట్ర బస్టాప్ సమీపంలో ఒక లేబర్ కాంట్రాక్టర్ ద్వారా వీరిద్దరిని నెల రోజుల క్రితం నియమించుకున్నాడు. ధెంగ్రేకు మంచి పేరు ఉంది. ఎలాంటి వివాదాలూ లేవని సమాచారం.
హత్యానంతరం ఛోటు మరియు ఆది ధెంగ్రే కారుతో పారిపోయారు. కానీ విహిర్‌గావ్ సమీపంలోని నాగ్‌పూర్-ఉమ్రెడ్ రహదారిపై డివైడర్‌ను ఢీకొట్టారు. పచ్‌గావ్ నుంచి నాగ్‌పూర్‌కు వెళ్తుండగా ప్రమాదం జరగడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. ఇద్దరు దుండగులు కారు దిగి దిఘోరి నాకా వైపు పారిపోతున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. వారు డిఘోరి నుండి ఇ-రిక్షా తీసుకున్నారు. ఆ తరువాత వారి కదలికను కనుగొనలేకపోయారు.
ఆది, చోటూ కలిసి డిన్నర్ చేస్తున్న సమయంలో ధెంగ్రేకి గొడవ జరిగినట్లు పోలీసులు తెలిపారు. దీపావళికి డబ్బు, బోనస్ ఇవ్వాలని ఇద్దరూ డిమాండ్ చేశారు. ధెంగ్రే వారికి డబ్బులు ఇస్తానని.. కానీ తరువాత ఇస్తానని చెప్పాడు. ఆ తరువాత ధెంగ్రే వెళ్లి ఒక మంచం మీద పడుకున్నాడు. ఆది, ఛోటూ.. మెల్లిగా అక్కడికి చేరుకుని బలమైన వస్తువుతో ధెంగ్రే తలమీద కొట్టాడు. దీనికి ముందు తాడుతో గొంతు బిగించి, పదునైన ఆయుధంతో ముఖంపై దాడిచేశారు.
ఆ తరువాత నిర్జీవంగా మారిన ధేంగ్రేను మంచం మీద వదిలేసి, మృతదేహాన్ని బొంతతో కప్పి, అతని కారుతో పరారయ్యారు. హత్యకు ప్రత్యక్ష సాక్షిగా ఉన్న మరో కార్మికుడు ప్రాణభయంతో వంటగదిలో దాక్కున్నాడు. ధెంగ్రే కుమార్తె ఎన్నిసార్లు ఫోన్ చేసినా.. తండ్రి నుంచి సమాధానం లేకపోవడంతో.. ధాబా సమీపంలోని పాన్ షాపు యజమానికి కాల్ చేసింది. పాన్ షాపు యజమాని ధాబా వద్దకు వెళ్లి.. చూడంగా మంచం మీద రాజు దేంగ్రే మృతదేహం కనిపించడంతో విషయం వెలుగు చూసింది.