సడెన్ గా బ్రేకులు వేయడంతో ట్రక్కును ఢీకొన్న కారు.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

By Asianet News  |  First Published Nov 12, 2023, 5:27 PM IST

రాజస్థాన్ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుపై ప్రయాణిస్తున్న సమయంలో ఓ ట్రక్కు సడెన్ గా బ్రేకులు వేయడంతో దాని వెనకాల ఉన్న కారు వచ్చి వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న నలుగురు చనిపోయారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు.


రాజస్థాన్ లోని బుండి జిల్లాలోని 52వ నెంబరు జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ట్రక్కును కారు వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో మధ్యప్రదేశ్ కు చెందిన ఓ కుటుంబం అక్కడికక్కడే మరణించింది. ఈ కుటుంబం పుష్కర్ కు వెళ్తుండగా హిందోలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

కల్తీ మద్యం తాగి 18 మంది మృతి.. ఏడుగురిని అరెస్టు చేసిన పోలీసులు.. ఎక్కడంటే ?

Latest Videos

undefined

వివరాలు ఇళా ఉన్నాయి. మధ్యప్రదేశ్ లోని అగర్-మాల్వా జిల్లాలోని గంగుఖేడి గ్రామానికి చెందిన దేవీ సింగ్ (50), అతడి భార్య మాన్ఖోర్ కన్వర్ (45), అతడి సోదరుడు రాజారామ్ (40), మేనల్లుడు జితేంద్ర (20) ఓ కారులో రాజస్థాన్ లోని పుష్కర్ కు బయలుదేరింది. ఆ కారు నేషనల్ హైవే నెంబర్ 52పై ప్రయాణిస్తూ ఆదివారం తెలవారుజామున బుండి జిల్లాలోని హిందోలి పోలీస్ స్టేషన్ పరిధిలోకి చేరుకుంది.

tunnel collapses : కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న సొరంగం.. చిక్కుకుపోయిన 36 మంది కార్మికులు..

అయితే వీరు ప్రయాణిస్తున్న కారు వేగంగా వెళ్తోంది. ఈ కారు ముందు ఓ ట్రక్కు కూడా వెళ్తోంది. అయితే ఆకస్మాత్తుగా ట్రక్కు డ్రైవర్ బ్రేకులు వేయడంతో వెనకాల ఉన్న కారు దానిని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కారులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. బాధితురాలిని హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అయితే అక్కడ చికిత్స పొందుతున్న సమయంలోనే పరిస్థితి విషమించంతో ఆమె మరణించింది.

Fire in Dal Lake : కాశ్మీర్ లోని దాల్ సరస్సులో అగ్నిప్రమాదం.. ముగ్గురు బంగ్లాదేశీ పర్యాటకులు మృతి

కాగా.. ఈ ప్రమాదానికి కారణమైన ట్రక్ ను దాని డ్రైవర్ అక్కడే వదిలేసి పారిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మృతదేహాలను మార్చురీలో భద్రపరిచామని, బాధిత కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత పోస్టుమార్టం నిర్వహిస్తామని పోలీసులు వెల్లడించారు.

click me!