అత్యధిక కాలం( ఐదేళ్లు) ముఖ్యమంత్రిగా కొనసాగిన ఘనత ఆయన కు దక్కింది. అంతేకాకుండా... అతి తక్కువ కాలం సీఎం గా కొనసాగిన ఘనత కూడా ఆయనకే దక్కడం గమనార్హం.
మహారాష్ట్రలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. బీజేపీకి అధికారం చిక్కింది అనుకునేలోపే... మళ్లీ శివసేన తన చేతిలోకి లాక్కుంది. మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్.. కేవలం మూడున్నర రోజులపాటు ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆ వెంటనే రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా... తాజాగా ఆయన ఓ రికార్డు సృష్టించాడు.
ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ వినూత్న రికార్డులు సాదించారు. వీటిలో ఒకటి అత్యధిక కాలం( ఐదేళ్లు) ముఖ్యమంత్రిగా కొనసాగిన ఘనత ఆయన కు దక్కింది. అంతేకాకుండా... అతి తక్కువ కాలం సీఎం గా కొనసాగిన ఘనత కూడా ఆయనకే దక్కడం గమనార్హం. రెండో సారి ఫడ్నవిస్ మూడున్నర రోజులు ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఈ రెండు రికార్డులతోపాటు సుమారు 20 రోజులలోపాటు రెండు సార్లు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి మరో రికార్డు కూడా సృష్టించారు. మహారాష్ట్ర అవతరించిన అనంతరం ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా కొనసాగిన రెండో ముఖ్యమంత్రిగా రికార్డుకెక్కారు.
undefined
Also Read మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం: ఎమ్మెల్యేల ప్రమాణం...
గతంలో మహారాష్ట్ర తొలి ముఖ్యమంత్రి యశ్వంత్ రావు చవాన్ ఐదేళ్లపాటు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగారు. అనంతరం 2014లో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ధేవేంద్ర ఫడ్నవీస్ ఐదేళ్లపాటు దిగ్విజయంగా పాలించారు. దీంతో ఆయన ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగిన రెండో ముఖ్యమంత్రిగా రికార్డుకి ఎక్కారు.
Also Read సీఎంగా ఫడ్నవీస్ రాజీనామా... ట్విట్టర్లో భార్య అమృత కవిత...
ఇలాంటి రికార్డు సృష్టించిన ఆయన 2019 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పక్షంలో ఆయన తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇది జరిగిన అనంతరం మళ్లీ నవంబర్ 23వ తేదీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి పదవీ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.