నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ-47

By telugu teamFirst Published Nov 27, 2019, 9:55 AM IST
Highlights

కార్టోశాట్-3 ఉపగ్రహం భూవాతావరణం, విపత్తులను హెచ్చరించనుంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రణాళికలు, రహదారుల నెట్ వర్క్ పరిశీలన, నీటి సరఫరా పై అధ్యయనానికి ఇది ఉపయోగపడనుంది

పీఎస్ఎల్వీ సీ 47 వాహన నౌక నింగిలోకి దూసుకెళ్లింది. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి పీఎస్ ఎల్వీ సీ 47 దూసుకెళ్లింది. 14 ఉపగ్రహాలను పీఎస్ ఎల్వీ 47 వాహన నౌక మోసుకు వెళ్లడం విశేషం. కార్టోశాట్-3తోపాటు అమెరికాకు చెందిన మరో 13 ఉపగ్రహాలను పీఎస్ ఎల్వీ సీ47 వాహన నౌక నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది.

కార్టోశాట్-3 ఉపగ్రహం భూవాతావరణం, విపత్తులను హెచ్చరించనుంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రణాళికలు, రహదారుల నెట్ వర్క్ పరిశీలన, నీటి సరఫరా పై అధ్యయనానికి ఇది ఉపయోగపడనుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఇస్రో కార్టో శాట్ -3ని రూపొందించిది. 1,625 కిలో బరువున్న కార్టోశాట్-3 జీవితకాలం ఐదేళ్లపాటు సేవలందించనుంది. 

మంగళవారం ఉదయం 7.28గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఈ ప్రక్రియ 26గంటలపాటు సాగింది. చంద్రయాన్-2 తర్వాత చేపట్టిన తొలి ప్రయోగం ఇదే. ఈ ప్రయోగం ద్వారా కార్టోశాట్-3తోపాటు అమెరికాకు చెందిన 13 నానో ఉపగ్రహాలను కూడా నింగిలోకి పంపనున్నారు. 

click me!