'దేశ్ కే మెంటర్స్'ప్రోగ్రాం బ్రాండ్ అంబాసిడర్ గా సోనుసూద్..

By AN TeluguFirst Published Aug 27, 2021, 12:07 PM IST
Highlights

విద్యార్థులకు భవిష్యత్తులో ఏమి చేయాలో అవగాహన ఉండనప్పుడు, కుటుంబంలో ఎవరూ చెప్పగలిగే పరిస్థితిలో లేనప్పుడు వారి పరిస్థితి ఏమిటి? అలాంటప్పుడు ఎవరో ఒకరు విద్యార్థులకు మార్గదర్శకత్వం నిర్వహించాలి.  ‘దేశ్ కే మెంటర్స్’ ప్రోగ్రాం ఇందుకు ఉద్దేశించిందే అని సోను తెలిపారు.

ఢిల్లీ : బాలీవుడ్ నటుడు సోనుసూద్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను శుక్రవారంనాడు కలుసుకున్నారు. ఢిల్లీ ప్రభుత్వం కొత్తగా అమలు చేయనున్న 'దేశ్ కే మెంటర్స్'ప్రోగ్రాంకు బ్రాండ్ అంబాసిడర్ గా సోనుసూద్ పని చేయనున్నట్టు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ మీడియా సమావేశంలో వీరిద్దరూ పాల్గొన్నారు.

త్వరలోనే ఈ ప్రోగ్రాం ప్రారంభమవుతుందని సీఎం ఈ సందర్భంగా తెలిపారు.  లక్షలాది మంది విద్యార్థులకు మార్గదర్శకత్వం వహించే అవకాశం తనకు ఈ రోజు లభించింది అని,  విద్యార్థులకు నిర్దేశం చేయడం కంటే గొప్ప సేవ ఇంకేమీ ఉండదని సోనుసూద్ అన్నారు.  ముఖ్యమంత్రితో కలిసి ఈ పథకం లక్ష్యాన్ని నెరవేరుస్తామని  తెలిపారు. 

లాక్ టౌన్ ప్రారంభమైనప్పుడు,  అనేక మందితో తాను మమేకమయ్యానని, విద్య అనేది ప్రధాన అంశం అనే విషయం తాను గ్రహించానని తెలిపారు. విద్యార్థులకు భవిష్యత్తులో ఏమి చేయాలో అవగాహన ఉండనప్పుడు, కుటుంబంలో ఎవరూ చెప్పగలిగే పరిస్థితిలో లేనప్పుడు వారి పరిస్థితి ఏమిటి? అలాంటప్పుడు ఎవరో ఒకరు విద్యార్థులకు మార్గదర్శకత్వం నిర్వహించాలి.  ‘దేశ్ కే మెంటర్స్’ ప్రోగ్రాం ఇందుకు ఉద్దేశించిందే అని సోను తెలిపారు.

ఈ సందర్భంగా పార్టీ రాజకీయాల్లోకి చేరతారా అని మీడియా అడిగిన ప్రశ్నకు సోనూసూద్ నవ్వుతూ సమాధానం ఇచ్చారు. ‘ నిరంతరం మంచి పనులు చేయాలంటే మీరు రాజకీయాల్లోకి రావాలని చాలా మంది అంటుంటారు.  మంచి పనులు చేయడానికి రాజకీయాలే అవసరం లేదు. నాకు అలాంటి ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. అయితే దాని గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తో కూడా రాజకీయాల గురించి మాట్లాడలేదు’ అని సోను సమాధానమిచ్చారు.

కాగా, రియల్‌ హీరో సోనూసూద్‌ గురించి ఇప్పుడు దేశం మొత్తం మాట్లాడుకుంటోంది. 2020కి ముందు హిందీ, తెలుగులో పలు సినిమాల్లో విలన్‌గా నటించి మెప్పించిన సోనూ సూద్‌ కేవలం కొద్ది మందికి తెలుసు. ఆయన్ని ఓ క్యారెక్టర్‌ ఆర్టిస్టుగానే చూసేవాళ్లు. కానీ ఇప్పుడు ఆయన్ని సినిమాలకు అతీతంగా చూస్తున్నారు. గొప్ప సేవా భావం కలిగిన వ్యక్తిగా భావిస్తున్నారు. పార్టీలకు, కుల మతాలకు అతీతంగా ఆయన్ని ఆదరిస్తున్నారు, ప్రేమిస్తున్నారు. 

సోనూ సూద్‌కి అరుదైన గౌరవం.. కిలిమంజారో అధిరోహకుడు తన సక్సెస్‌ అంకితం

కరోనా సమయంలో ఎంతో మంది ప్రాణాలు కాపాడారు. వలస కార్మికులను ఆదుకోవడం, ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం, కరోనాతో పోరాడుతున్న వారికి ఆక్సిజన్‌ అందించడం, ఆక్సిజన్‌ బెడ్స్ అందించడంలో సహాయం చేయడం, వెంటిలేటర్స్ బెడ్స్ ఇప్పించడం, అంతేకాదు ఏకంగా ఆక్సిజన్‌ ప్లాంట్లనే ఏర్పాటు చేయడం చేస్తున్నారు. కేవలం కరోనాకి సంబంధించిన సహాయాలు మాత్రమే కాదు, విద్య, వైద్యం వంటి వాటిలోనూ తనవంతు సాయం అందిస్తున్నారు. 

ఈ క్రమంలో గతేడాది నుంచి సోనూసూద్‌ వార్తల్లో నిలుస్తుంది. ఎక్కడ చూసినా ఆయన గురించిన చర్చే జరుగుతుంది. ప్రతి రోజులు ట్విట్టర్ వేదికగా అనేక విషయాలను పంచుకుంటున్నారు సోనూసూద్‌. సహాయం చేయడానికి కూడా సోషల్‌ మీడియాని ప్రధాన సాధనంగా వాడుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయనకు భారీ ఫాలోయింగ్‌ ఏర్పడింది. అందులో భాగంగా ఓ అఛీవ్‌మెంట్‌ సాధించారుసోనూసూద్‌. హీరోలకు మించిన సోషల్‌ మీడియా ఫాలోయింగ్‌ని ఏర్పర్చుకున్నారు. ట్విట్టర్‌లో ఆయన 9 మిలియన్స్‌ ఫాలోవర్స్ ని దాటడం విశేషం. 

ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌, విజయ్‌ దేవరకొండ వంటి క్రేజీ హీరోలకు మించిన ఫాలోయింగ్‌ సోనూసూద్‌ సొంతమైందని చెప్పొచ్చు. ఓ రకంగా ఇదొక అఛీవ్‌మెంట్‌గా చెప్పొచ్చు. ఆయన చేస్తున్న సేవనే ఆయన్ని మరింత మందికి దగ్గర చేస్తుందని చెప్పొచ్చు. 
 

click me!