తండ్రి చనిపోయాడని డిప్రెషన్.. 39 రోజుల కూతురును 14 అంతస్తు నుంచి తోసేసిన తల్లి..

By Asianet News  |  First Published Sep 23, 2023, 9:12 AM IST

కొంత కాలం నుంచి డిప్రెషన్ తో బాధపడుతున్న ఓ మహిళ తన కూతురును దారుణంగా కడతేర్చింది. 14వ అంతస్తు నుంచి 39 రోజుల వయస్సు ఉన్న కూతురును విసిరేసింది. దీంతో ఆ పసికందు తీవ్రగాయాలతో కన్నుమూసింది.


ఆమె తండ్రి ఏడాది కిందట చనిపోయాడు. అప్పటి నుంచి డిప్రెషన్ లో ఉన్నారు. కొంత కాలం కిందటే ఆమె ఓ కూతురుకు జన్మనిచ్చింది. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు గానీ.. తను నివసిస్తున్న 14వ అంతస్తు ఇంటి కిటికీ నుంచి 39 రోజుల వయస్సు ఉన్న కూతురును కిందికి విసిరేసింది. దీంతో ఆ పసికందు తీవ్ర గాయాలో చనిపోయింది. ఈ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబాయిలో చోటు చేసుకుంది.

పోలీసుల ప్రీ వెడ్డింగ్ షూట్ వైరల్ : హైదరాబాద్ సీపీని కలిసి క్షమాపణలు చెప్పిన కొత్త జంట

Latest Videos

ముంబై ముంబయిలోని ములుంద్‌లో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ తల్లి తన 39 రోజుల కూతురు హష్వీని 14వ అంతస్తు నుంచి గురువారం తెల్లవారుజామున తోసేసింది.దీంతో బాలిక అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆమె కొంత కాలం నుంచి డిప్రెషన్ తో బాధపడుతోంది. దాని కోసం చికిత్స కూడా పొందుతోంది. 

అయితే ములుంద్ పోలీసులు నిందితురాలైన తల్లి మనాలి పై హత్య కేసు నమోదు చేశారు. నిందితురాలు మనాలి మెహతా తండ్రి గతేడాది చనిపోయాడని, అప్పటి నుంచి ఆమె మానసిక ఒత్తిడికి లోనవుతున్నాడని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. అయితే ఆమె మానసిక చికిత్స నేపథ్యంలో నిందితురాలిని పోలీసులు ఇంకా అరెస్టు చేయలేదు.

విషాదం.. మట్టి గోడ కూలి ముగ్గురు మృతి.. హన్మకొండ జిల్లాలో ఘటన

కాగా.. మనాలి మెహతా ఎప్పుడూ తన తండ్రి గురించి చెబుతూ ఉండేది. కూతురు హష్వీకి తాతయ్య ఫోన్ చేస్తున్నాడని ఆమె తన కుటుంబ సభ్యుల వద్ద పదే పదే ప్రస్తావించేది. సెప్టెంబర్ 20వ తేదీన కూడా అదే విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. అయితే మరుసటి రోజు సెప్టెంబరు 21న తెల్లవారుజామున 4 గంటలకు 14వ అంతస్తులోని బెడ్‌రూమ్‌ కిటికీ తెరిచి తన 39 రోజుల కూతురు హష్వీని కిందకు విసిరేసింది. దీంతో గాయాలతో ఆ పసికందు కన్నుమూసింది. 

click me!