మోడీని పొగిడాడని డాక్టరేట్ ఆపేశారు.. కోర్టుకెళ్తానన్న విద్యార్ధి

By Siva KodatiFirst Published Dec 2, 2021, 4:12 PM IST
Highlights

అలీఘర్ యూనివర్సిటీకి (aligarh muslim university) చెందిన పీహెచ్‌డీ (phd student) విద్యార్థికి డాక్టరేట్ (doctorate degree) డిగ్రీ ఇవ్వకపోవడం కలకలం రేపుతోంది. 

అలీఘర్ యూనివర్సిటీకి (aligarh muslim university) చెందిన పీహెచ్‌డీ (phd student) విద్యార్థికి డాక్టరేట్ (doctorate degree) డిగ్రీ ఇవ్వకపోవడం కలకలం రేపుతోంది. క్యాంపస్ ఈవెంట్‌లో భాగంగా గతేడాది జరిగిన కార్యక్రమంలో దనీశ్ రహీం అనే వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీని పొగిడినందుకు గానూ పక్కకుపెట్టేశారు. దీంతో బాధితుడు ప్రస్తుతం హైకోర్టును ఆశ్రయిస్తూ.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ 9yogi adityanath) తనకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

లింగ్విస్టిక్ డిపార్ట్‌మెంట్‌లో భాగంగా.. లాంగ్వేజ్ ఆఫ్ అడ్వర్టైజింగ్ మీడియా అండ్ మార్కెట్ (LAMM) పీహెచ్‌డీ ప్రోగ్రాంలో బాధితుడు అడ్మిట్ అయ్యాడు. లింగ్విస్టిక్స్‌లో ఇష్యూ చేసిన అసంపూర్తి పీహెచ్ డీ డిగ్రీని సబ్‌మిట్ చేయాలని.. (LAMM) అప్పుడే కరెక్ట్ పీహెచ్‌డీ ఇష్యూ చేస్తుందని ఆర్డర్ వేస్తూ రహీమ్ కు ఒక లెటర్ వచ్చింది. దీనిపై అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ రెస్పాండ్ అవుతూ.. ‘రాజకీయాల కారణంగా ఇక్కడేం జరగలేదు. అతను కోర్టుకు వెళ్తానంటే ఎవరూ అడ్డుకోరు. ఇది యూనివర్సిటీ ఉద్దేశ్యం మాత్రమే’ అని ఏఎంయూ స్పష్టం  చేసింది. 
 

click me!