Air Pollution:గత కొన్ని సంవత్సరాలుగా మానవ అవసరాల పేరిట ఒకపక్క ప్రకృతి విధ్వంసం కొనసాగుతోంది. మరోపక్క ప్యాక్టరీలు, వాహనాల నుంచి రికార్డు స్థాయిలో గాలి కాలుష్య ఉద్గారాలు వెలువడుతున్నాయి. దీంతో కాలుష్యం పెరిగిపోతున్నది. ఇక దేశరాజధాని ఢిల్లీలో గాలిపీల్చుకోనివ్వటం లేదు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Air Pollution: గత కొంత కాలంగా దేశరాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నది. ఢిల్లీలో వాహనాలు రద్దీ పెరగడం, వాటి నుంచి వెలువడే కాలుష్య ఉద్గారాలు గాలి నాణ్యతపై ప్రభావం చూపుతున్నాయి. ఇక సరిహద్దు రాష్ట్రలైన హర్యానా, పంజాబ్‌లలో రైతులు పంట వ్యర్థాలను కాల్చడం వంటి చర్యల ద్వారా గాలి నాణ్యత క్షీణిస్తోంది. దీంతో పరిస్థితులు మరింత దారుణంగా మారుతున్నాయి. ఇటీవల కాలుష్యం తీవ్రత దృష్ట్యా లాక్‌డౌన్ విధించే అంశాన్ని సైతం పరిశీలించాలని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. గాలి కాలుష్యం (Air Pollution)తీవ్రత నేపథ్యంలో ప్రస్తుతం అక్కడి పాఠశాలలకు (Delhi schools) కేజ్రీవాల్ సర్కారు (Delhi government)సెలవులు ప్రకటించింది. వాయు కాలుష్యం తీవ్రత దృష్ట్యా రేపటి నుంచి (శుక్రవారం) అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తున్నాం. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు బడులు మూసివేయబడతాయి అని పర్యావరణ మంత్రి పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ వెల్లడించారు. అయితే, ఆన్‌లైన్ క్లాసులు కొనసాగుతాయని తెలిపారు.
Also Read: దేశంలోనే అతిపెద్ద సైబర్ మోసం.. వెలుగులోకి సంచలన విషయాలు
undefined
గాలి నాణ్యత మెరుగుపడుతున్నదనే సూచనలను పరిగణలోకి తీసుకుని పాఠశాలలు తిరిగి ప్రారంభించామని మంత్రి తెలిపారు. అయితే, కాలుష్యం పెరుగుతూ.. మళ్లీ గాలి నాణ్యత (Air Quality Index)పడిపోతుండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. కాగా, నవంబర్ 13న నుంచి మూతపడిన పాఠశాలలు, కళాశాలలు, వివిధ విద్యాసంస్థల భౌతిక తరగతులు సోమవారం నుంచి ప్రారంభించబడ్డాయి. అయితే, ఢిల్లీ కాలుష్యం పెరుగుతున్న వేళ పాఠశాలలు ప్రారంభించిన అంశంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇక రాజధానిలో కాలుష్యం తగ్గించడానికి తీసుకుంటున్న చర్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కాలుష్యం తగ్గించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలంటూ రెండు ప్రభుత్వాలకు అల్టిమేటం జారీ చేసింది. దీని కోసం 24 గంటల గడువును విధించింది. కాగా, గత నెల ప్రారంభం నుంచి ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు వాదనలు వింటున్నది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ప్రస్తావిస్తున్నది. అయితే, ప్రభుత్వాలు మెరుగైన చర్యలు తీసుకోకపోవడంతో గాలి కాలుష్యం పెరగడంపై Supreme Court ఆగ్రహం వ్యక్తం చేసింది.
Also Read: మాజీ మిస్ కేరళ మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి...
ఇదిలావుండగా, అధికమవుతున్న కాలుష్యం కారణంగా భూతాపం పెరగడంతో పాటు అనేక జీవజాతుల మనుగడ ప్రమాదంలో పడుతోంది. ఇప్పటికే అనేక జాతులు అంతరించిపోగా, మరికొన్ని అంతరించే కేటగిరిలోకి జారుకున్నాయి. మానవ మనుగడ సైతం ప్రశ్నార్థకమవుతోంది. ఇటీవల ప్రపపంచంలో అత్యంత కాలుష్య నగరాల జాబితాను స్విట్జర్లాండ్‌కు చెందిన క్లైమేట్ గ్రూప్ ఐక్యూఎయిర్(IQAir) ఓ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం.. ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరాల జాబితాలో దేశరాజధాని ఢిల్లీ మొదటిస్థానంలో ఉంది. అంటే అక్కడ వాయు కాలుష్యం ఏ స్థాయిలో కొనసాగుతుందనేదానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఢిల్లీతో పాటు దేశంలోని చాలా నగరాలు కాలుష్య కొరల్లోకి జారుకుంటున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఇప్పుడే జాగ్రత్తలు, కాలుష్య నివారణ చర్యలను వేగవంతం చేయాల్సిన అవసరాన్ని శాస్త్రవేత్తలు, పర్యావరణవేత్తలు గుర్తు చేస్తున్నారు.
Also Read: మమతా బెనర్జీకి కాంగ్రెస్ కౌంటర్.. ఆమెకు పిచ్చిముదిరిందంటూ..