ఇంట్లో నుంచి వెళ్లగొట్టిందని.. ప్రొఫెసర్ భార్యను కిరాతకంగా చంపిన డ్రైవర్..

By AN TeluguFirst Published Nov 10, 2021, 11:55 AM IST
Highlights

ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్ భార్య హత్య కేసులో అనుమానితుడిని రోడ్డు పక్కన ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

న్యూఢిల్లీ : ఢిల్లీలో ఓ మహిళను దారుణంగా హత్య చేసిన నిందితుడిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. హత్యకు గల కారణం చిన్నదే కానీ.. పట్టరాని కోపం, ద్వేషం.. తనను అవమానించారన్న కసి.. వెరసి ఓ మహిళ ప్రాణం గాల్లో కలిసేలా చేసింది. ముప్పై యేళ్లకే అతి దారుణంగా నిండు నూరేళ్లూ నిండేలా చేసింది. 

మూడేళ్లుగా తానుంటున్న ఇంట్లోంచి బలవంతంగా గెంటివేసిందన్న కోపంతో ఓ వ్యక్తి 32 ఏళ్ల మహిళను గొంతు కోసి, విద్యుదాఘాతానికి గురిచేసి హత్య చేశాడు. ఈ  కేసులో 31 ఏళ్ల వ్యక్తిని మంగళవారం ఢిల్లీలో పోలీసులు అరెస్టు చేశారు. murder చేయడానికి అతను చెప్పిన కారణం అందర్నీ షాక్ కు గురి చేసింది. 

హతురాలు ఢిల్లీ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తి భార్య పింకీ. సోమవారం వాయువ్య ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో "రోడ్డు పక్కన భయంతో కూర్చున్న"ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. హత్య కేసులో అనుమానితుడు రాకేష్‌ అతడేనని తేలిందని పోలీసులు తెలిపారు.

పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా, తను ఒక womanను చంపినట్లు ఒప్పుకున్నాడు. అంతేకాదు ఆమె తనకు వదినలాంటిదని చెప్పుకొచ్చాడు. హత్య చేసిన ఇంటి గుర్తులు చెప్పడంతో పోలీసులు సంత్ నగర్‌లోని మహిళ ఇంటికి వెళ్లగా.. అక్కడ మృతదేహం లభించింది. 

పోలీసులు విచారణలో భాగంగా, నిందితుడు హత్యకు గల కారణాన్ని చెబుతూ.. పింకీ భర్త assistant professor  వీరేందర్ కుమార్ మూడేళ్ల క్రితం తన ఇంటి పై అంతస్తులో ఉండటానికి నిందితుడికి allow చేశాడని తెలిపాడు. అప్పటికే రాకేష్ నిరుద్యోగి. ఎలాంటి ఆదాయవనరులు లేవు. ఉపాధి అవకాశాలు లేకపోవడంతో అతనికి జీవనోపాధి కల్పించడం కోసం Delhi Universityలో అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిన  Virender Kumar  తన కారు డ్రైవర్ గా పెట్టుకున్నాడు. 

UP Lockup Death.. ఐదుగురు పోలీసుల సస్పెన్షన్..

ఆ తరువాత కొంతకాలానికి.. వీరేందర్ కు ఫిబ్రవరి 2021లో పింకీతో వివాహం అయ్యింది. అప్పటినుంచి పింకీ దృష్టి రాకేష్ మీద పడింది. కారు డ్రైవర్ గా పనిచేస్తున్నా.. తమ ఇంట్లోనే అద్దెకుండడం మొదట్లో అర్థం కాలేదు. ఆ తరువాత సమస్య మెల్లిగా రాకేష్ తమ మీదే పూర్తిగా ఆధారపడ్డాడన్న విషయం పింకీకి అర్థం అయ్యింది. రాకేష్‌కి స్థిరమైన ఆదాయం లేకపోవడం వల్ల rakesh కు అద్దె కట్టలేకపోయేవాడు. దీంతో కోపానికి వచ్చిన పింకీ తనను బలవంతంగా ఇంటి నుంచి గెంటేశారని ఆయన పేర్కొన్నారు.

దీంతో అవమానం ఫీలైన రాకేష్, పింకీ మీద కోపాన్ని పెంచుకున్నాడు. ఎలాగైనా ఆమెకు బుద్ది చెప్పాలనుకున్నాడు. సమయం కోసం వేచి చూశాడు. కుమార్ ఇంట్లో లేని సమయంలో రాకేష్ అతని ఇంటికి వెళ్లి పింకీని హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఆదరించి, ఆశ్రయమిచ్చిన వ్యక్తికే క్షణికావేశంలో.. విచక్షణ కోల్పోయి తీరని ద్రోహాన్ని తలపెట్టిన రాకేష్ మీద పోలీసులు కేసు నమోదు చేశారు. హత్య నేరం కింద దర్యాప్తు ప్రారంభించారు. 

click me!