చావ్లా హత్యాచారం కేసు : నిర్దోషులుగా నిందితులు, సుప్రీం తీర్పును సవాల్ చేస్తూ ఢిల్లీ రివ్యూ పిటిషన్...

By SumaBala BukkaFirst Published Nov 21, 2022, 12:24 PM IST
Highlights

ఓ యువతిని కిడ్నాప్ చేసి హత్యాచారం చేసిన కేసులో ముగ్గురు నిందితులను నిర్ధోషులగా సుప్రీం విడుదల చేసింది. దీన్ని సవాల్ చేస్తూ ఎస్సీలో ఢిల్లీ రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. 

ఢిల్లీ : చావ్లా కేసులో నిందితులను నిర్దోషిగా విడుదల చేయడంపై రివ్యూ పిటిషన్‌ను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆమోదించారు. అత్యాచారం-హత్య కేసులో మరణశిక్ష పడిన ముగ్గురు వ్యక్తులను ఇటీవల సుప్రీంకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.

2012లో చావ్లా అత్యాచారం-హత్య కేసులో నిందితులను నిర్దోషులుగా విడుదల చేయడంపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ దాఖలయ్యింది. దీన్ని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆమోదించారు. సుప్రీం కోర్టులో ఈ కేసును వాదించేందుకు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, అదనపు ఎస్జీ ఐశ్వర్య భాటిల నియామకాన్ని ఎల్-జి సక్సేనా ఆమోదించారు.

ప్రేమను నిరాకరించిందని, మత్తు ఇచ్చి బలవంతంగా పెళ్లి.. ఒప్పుకోలేదని స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారం..

ఫిబ్రవరి 2012లో 19 ఏళ్ల మహిళను అపహరించి, అత్యాచారం చేసి, చంపినట్లు ముగ్గురు వ్యక్తులపై ఆరోపణలు వచ్చాయి. కిడ్నాప్ అయిన మూడు రోజుల తర్వాత ఆమె ఛిద్రమైన శరీరం దొరికింది. కాగా, చావ్లా కేసులో మరణశిక్ష పడిన ముగ్గురిని వారం రోజుల క్రితం సుప్రీంకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. నిందితులకు వ్యతిరేకంగా డిఎన్‌ఎ ప్రొఫైలింగ్, కాల్ వివరాల రికార్డులతో సహా లీడింగ్, కోజెంట్, క్లిన్చింగ్, స్పష్టమైన సాక్ష్యాలను అందించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.

2014లో, ట్రయల్ కోర్టు ఈ కేసును "అరుదైనది" అని పేర్కొంది. ముగ్గురు నిందితులకు మరణశిక్ష విధించింది. ఈ తీర్పును ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. ఇటీవల రోహిణి జైలు నుండి ముగ్గురు ఖైదీలలో ఇద్దరిని విడుదల చేయడం, ఎస్సీ నిర్దోషిగా ప్రకటించడంతో, హత్యకు గురైన బాలిక తల్లిదండ్రులు భయంతో పోలీసు రక్షణను కోరుతున్నారు.

ఈ నేపథ్యంలో ఢిల్లీ ఉమెన్ కమీషన్ ఢిల్లీ పోలీసులకు ఒక నోటీసు జారీ చేసింది. ఇందులో, ఈ విషయం చాలా సున్నితమైనదని, నేరస్థులు ఇప్పుడు స్వేచ్ఛగా బయటికి వచ్చారు కాబట్టి... మరణించిన మహిళ కుటుంబ సభ్యులకు ఉన్నత స్థాయి భద్రత కల్పించాలని పేర్కొంది.

click me!