55 సార్లు కత్తితో పొడిచి, గొంతు కోసి, గంతులేస్తూ.. బిర్యానీ కొనివ్వలేదని 16 ఏళ్ల బాలుడి దారుణం

By Mahesh K  |  First Published Nov 23, 2023, 4:01 PM IST

దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం రాత్రి పూట 16 ఏళ్ల బాలుడు అపరిచితుడైన 17 ఏళ్ల బాలుడిని బిర్యానీ కోసం డబ్బులు అడిగాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో దాడి చేశాడు. కత్తి తీసి 55 సార్లకుపైగా పొడిచేశాడు. ఆ బాడీని ఇరుకైన సందిలో కొంత దూరం లాక్కెళ్లి మళ్లీ దాడి చేశాడు. ఆ తర్వాత బాధితుడి జేబులో నుంచి రూ. 350 పట్టుకుని పరారయ్యాడు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. నేరాన్ని నిందితుడు అంగీకరించాడు.
 


న్యూఢిల్లీ: బిర్యానీ కొనివ్వలేదని ఢిల్లీలో 16 ఏళ్ల బాలుడు క్రూరంగా మారిపోయాడు. 17 ఏళ్ల బాలుడిపై దారుణంగా దాడి చేశాడు. కత్తితో కనీసం 55 సార్లు దాడి చేశాడు. ముఖం పై, వీపు భాగంలో, మెడ భాగంలో విచక్షణారహితంగా దాడి చేశాడు. గొంతు కోశాడు. వీధిలో ఆ డెడ్ బాడీని కొంత దూరం లాగి మళ్లీ దాడికి పాల్పడ్డాడు. ఇలా దాడి చేస్తూనే ఉన్మాదంతో డ్యాన్సలు చేశాడు. కత్తి చేతపట్టుకుని గంతులేశాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో బయటపడ్డాయి. తూర్పు ఢిల్లీలో మంగళవారంలోనే ఘటన జరిగినట్టు పోలీసులు గురువారం వెల్లడించారు.

మంగళవారం జనతా మజ్దూర్ కాలనీలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి 2.23 నిమిషాల సీసీటీవీ ఫుటేజీ వైరల్ అవుతున్నది. దాడిని ఆపడానికి ప్రయత్నించినవారినీ అదే కత్తితో దుండగుడు బెదిరిస్తూ కనిపించాడు. బుధవారం ఉదయమే అరెస్టయిన నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. బిర్యానీ షాప్ దగ్గర ఉన్న ఓ 17 ఏళ్ల బాలుడిని బిర్యానీ కోసం డబ్బులు అడిగాడు. ఆ 17 ఏళ్ల బాలుడు నిందితుడికి తెలియదు. కానీ, డబ్బులు అడిగాడు. 17 ఏళ్ల బాలుడు తిరస్కరించాడు. కొంతసేపు వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య దాడి జరిగింది.

Latest Videos

మంగళవారం రాత్రి 11.15 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. బాధితుడిని వెంటనే హాస్పిటల్ తరలించగా.. మార్గంమధ్యలోనే మరణించినట్టు వివరించారు.

Also Read : Fathima Beevi: సుప్రీంకోర్టు తొలి మహిళా జడ్జీ ఫాతిమా బీవీ కన్నుమూత

‘జాఫ్రాబాద్‌కు చెందిన 17 ఏళ్ల బాధితుడిని నిందితుడు కొట్టాడు. శ్వాస కోసం ఇబ్బంది పడేంతగా బాధితుడిని కొట్టాడు. ఆ తర్వాత స్పృహ కోల్పోయిన బాధితుడిపై ఒక చిన్న కత్తిని తీసి దాడి చేశాడు. ఆ తర్వాత కొంతదూరం బాడీని లాక్కెళ్లి మల్లీ ముఖం, మెడపై, వీపుపై, కళ్ల కింద 55 సార్లకు పైగా దాడి చేశాడు’ అని పోలీసులు వివరించారు. ‘దాడి చేస్తున్నప్పుడు నిందితుడు మద్యం మత్తులో ఉన్నాడు’ అని తెలిపారు. 

‘బాధితుడిపై కత్తితో దాడి చేస్తూ నిందితుడు డ్యాన్స్ చేశాడు. బయట ఏం జరుగుతుందో చూడటానికి ఓ వ్యక్తి తలుపులు తీయగా అదే కత్తితో బెదిరించాడు’ అని పోలీసులు తెలిపారు. ‘కొంత దూరం ఇరుకైన ఆ సందులో బాడీని లాగుతూ తీసుకెళ్లాడు. బాధితుడి బాడీ నుంచి రూ. 350 దొంగిలించి అక్కడి నుంచి పారిపోయాడు. నిందితుడిని ఇప్పటికే మేం అరెస్టు చేశాం. దాడి చేయడానికి ఉపయోగించిన కత్తిని రికవరీ చేసుకున్నాం. ఆ కత్తి ఎక్కడి నుంచి తీసుకున్నాడనేది దర్యాప్తు చేస్తున్నాం. నిందితుడిని వేగంగా గుర్తించడానికి సీసీటీవీ ఫుటేజీ ఉపకరించింది’ అని పోలీసులు చెప్పారు.

click me!