Uttarkashi : సొరంగంలోడ్రిల్లింగ్ పనులు పూర్తి.. కాసేపట్లో కార్మికులందరూ బైటికి..

By SumaBala BukkaFirst Published Nov 23, 2023, 1:12 PM IST
Highlights

సిల్క్యారాలోని సొరంగంలో చిక్కుకున్న కార్మికులను తరలించే పనులు చివరి దశలో ఉన్నాయి. ఇనుప శిథిలాలు రావడంతో తవ్వకాన్ని నిలిపివేసి మళ్లీ ప్రారంభించారు. ఢిల్లీ నుంచి నిపుణుల బృందం వచ్చింది.

ఉత్తరకాశీ : ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలోని సిల్క్యారాలో నిర్మాణంలో ఉన్న సొరంగంలో చిక్కుకున్న 41 మంది కూలీలను రక్షించడానికి నవంబర్ 12 నుండి జరుగుతున్న ఆపరేషన్ దాదాపు ముగింపు దశకు చేరుకుంది. డ్రిల్లింగ్ పని పూర్తయింది, ఇప్పుడు కార్మికులందరినీ ఖాళీ చేసే పని 1-2 గంటల్లో ప్రారంభమవుతుందని అంచనా వేస్తున్నారు. గురువారం ఉదయం 8 గంటలకే కూలీలను బయటకు తీసుకురావాల్సి ఉండగా తవ్వే సమయంలో ఇనుప చెత్తాచెదారం అడ్డు రావడంతో ఆగర్‌ యంత్రం నిలిచిపోయింది. 

ఢిల్లీకి చెందిన నిపుణుల బృందం యంత్రాన్ని సరిదిద్దింది, ఆ తర్వాత అడ్డంకిగా ఏర్పడిన చెత్తను తొలగించి మళ్లీ డ్రిల్లింగ్ ప్రారంభించారు. కార్మికులను బైటికి తీసుకువచ్చే, శుభవార్త త్వరలో అందుతుందని ఆశిస్తున్నాం అన్నారు. సొరంగం నిర్మాణం, రెస్క్యూ ఆపరేషన్లలో ఉపయోగించే పెద్ద యంత్రాలు, కంప్రెసర్ యంత్రాల యజమాని శైలేష్ గులాటీతో ఏషియానెట్ న్యూస్ హిందీ మాట్లాడింది. 

Latest Videos

Sabarimala Temple: శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు అలర్ట్..

కూలీలను తరలించేందుకు నిర్మిస్తున్న రోడ్డు పనులు తుదిదశకు చేరుకున్నాయన్నారు. ఇంకా 5-6 మీటర్లు మాత్రమే తవ్వాల్సి ఉండగా ఇనుప చెత్తాచెదారం అడ్డు రావడంతో తవ్వకాలను ఆపాల్సి వచ్చింది. శిథిలాలలో ఇనుప పైపులు,రాడ్లు ఉన్నాయి. దీంతో యంత్రం రెండు పైపులు వంగిపోయింది. ఢిల్లీ నుంచి నిపుణుల బృందం వచ్చి యంత్రానికి మరమ్మతులు చేశారు. తరువాత మళ్లీ తవ్వకం పనులు ప్రారంభమయ్యాయి. త్వరలోనే బైటికి తీసుకువస్తాం అని చెప్పారు. 

కూలీలను తరలించేందుకు సన్నాహాలు పూర్తి చేశారు

కూలీలను తరలించేందుకు పూర్తి స్థాయిలో సన్నాహాలు చేసినట్లు గులాటీ తెలిపారు. ఆహార పైపును చొప్పించి, వారికి ఆహారం, నీళ్లు అందించాం.  అది ఆరు అంగుళాల వెడల్పు పైపు. 800ఎంఎం పైపును వేయడానికి చేస్తున్న తవ్వకానికి ఆటంకం ఏర్పడింది. అంతా సవ్యంగా జరిగి ఉంటే ఇప్పటికి పనులు పూర్తయ్యేవి. తవ్వకం ఎప్పుడు పూర్తవుతుందో ఇప్పుడే చెప్పడం కష్టం. ఢిల్లీ నుంచి వచ్చిన నిపుణుల బృందం సలహా మేరకు ఎలా ముందుకు వెళ్లాలో నిర్ణయిస్తారు అని చెప్పారు. 

సొరంగంలో చిక్కుకున్న కార్మికుల పరిస్థితి బాగానే ఉంది
గులాటి మాట్లాడుతూ, "లోపల చిక్కుకున్న వారితో చర్చలు జరుగుతున్నాయి. ఆహారం అందించడానికి అమర్చిన పైపు ద్వారా చర్చలు జరుగుతున్నాయి. వాయిస్ స్పష్టంగా ఉంది. కెమెరాలు అమర్చడం ద్వారా లోపల పరిస్థితి కనిపించింది. వారి పరిస్థితి బాగానే ఉంది. అయితే వారి మానసిక స్థితి పరిస్థితి బలహీనంగా తయారవుతోంది. కూలీలకు పూర్తి ఆహారం ఇస్తున్నాం. ఇంతకుముందు డ్రై ఫ్రూట్స్ మాత్రమే ఇచ్చేవారు. ఇప్పుడు రోటీ, రైస్ వంటి పూర్తి ఆహారం ఇస్తున్నాం" అన్నారు. 
 

click me!