మళ్లీ ఢిల్లీ తరహా యాక్సిడెంట్.. యూపీలో స్కూల్ స్టూడెంట్ ను ఢీకొట్టి కిలోమీటరు ఈడ్చుకెళ్లిన కారు..

By team teluguFirst Published Jan 8, 2023, 8:16 AM IST
Highlights

ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. కోచింగ్ క్లాసు నుంచి తిరిగి వస్తున్న తొమ్మిదో తరగతి చదివే బాలుడిని ఓ కారు ఢీకొట్టింది. కిలో మీటరు పాటు ఈడ్చుకెళ్లింది. దీంతో బాలుడికి తీవ్ర గాయాలు అయ్యాయి.

ఢిల్లీలోని కంఝవాలాలో భయానక ఘటన మరవకముందే పలు రాష్ట్రాల్లో ఇలాంటి తరహా ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. యూపీ, పశ్చిమ బెంగాల్ లో ఇటీవల అలాంటి ప్రమాదాలే జరిగాయి. అయితే తాజాగా మళ్లీ యూపీలోనే ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఓ స్కూల్ స్టూడెంట్ ను కారు ఢీకొట్టి, 15 కిలో మీటర్లు లాక్కెళ్లింది. 

ఢిల్లీలో కుప్పకూలిన బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు..

వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని కొత్వాలి నగరం హర్దోయ్‌లో 15 ఏళ్ల కేతన్‌కుమార్ స్థానికంగా ఉన్న ఓ స్కూల్ లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఎప్పటిలాగే తన సైకిల్ పై శనివారం కూడా కోచింగ్ క్లాస్ కు వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఓ తెల్లటి వ్యాగన్‌ఆర్‌ పైకి దూసుకెళ్లింది. దీంతో ఆ బాలుడి కాలు కారు వెనకాల భాగంలో చిక్కుకుపోయింది.

అయితే దీనిని కారులో ఉన్న వ్యక్తులు గమనించినప్పటికీ అక్కడి నుంచి తప్పించుకొని పారిపోవాలనే ఉద్దేశంతో వాహనాన్ని వేగంగా పోనిచ్చారు. స్థానికులు కారు ఆపాలని ఎంతగా అరిచినా కూడా వారు వినలేదు. బాలుడిని ఈడ్చుకుంటూనే వెళ్లిపోయారు. దీంతో కేతన్ కుమార్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. బాలుడిని స్థానికులు సమీపంలోని హాస్పిటల్ కు తరలించారు.

వరుస హత్యలతో బెంబెలెత్తిస్తున్న సైకో కిల్లర్.. ఇప్పటి వరకూ మూడు హత్యలు.. హంతకుడిపై రూ. 25 వేల రివార్డు ..

ఈ ఘటనపై పోలీసు అధికారి, బఘౌలీ సీఓ బికాస్ జైస్వాల్ మాట్లాడుతూ.. “కొత్వాలీ సిటీ ప్రాంతంలో సైకిల్‌పై వెళ్తున్న బాలుడిని కారు ఢీకొట్టింది. దీంతో బాలుడి కాలు కారులో ఇరుక్కుపోయింది. బాలుడిని కారు కొంత దూరం ఈడ్చుకెళ్లింది. బాధితుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నాం.చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం’’ అని  సీఓ బికాస్ జైస్వాల్ తెలిపారు.

ఈ ప్రమాదం దృష్యాలు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. అందులో బాలుడు కారు నుంచి కాలును విడిపించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. వాహనం వెనకాల స్థానికులు పరిగెట్టడం కూడా కనిపిస్తోంది. చివరకు రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతంలో కారు ఆగిన తర్వాత కేతన్‌ను రక్షించి హాస్పిటల్ కు తరలించారు. స్థానికులు ఆగ్రహంతో డ్రైవర్‌ను పట్టుకుని కర్రలతో కొట్టారు. అనంతరం కారును కూడా ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆగ్రహించిన జనాల నుంచి డ్రైవర్‌ను రక్షించి అదుపులోకి తీసుకున్నారు.

మరోసారి ఆడపిల్ల పుట్టిందనీ.. రెండు రోజుల పసికందును గొంతు నులిమి హత్య చేసిన కన్నతల్లి

ఈ నెలలో ఇలాంటి ఘటన జరగడం ఇది మూడోది. రెండు రోజుల క్రితం యూపీలోని నోయిడాలో డెలివరీ బాయ్ టూ వీలర్ ను ఢీకొట్టింది. అతడిని కూడా 500 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లడంతో మృతి చెందాడు. అలాగే జనవరి 1 తెల్లవారుజామున ఢిల్లీలోని కంఝవాలా ప్రాంతంలో 20 ఏళ్ల అంజలి సింగ్ అనే మహిళ కారుతో సుమారు 12 కిలోమీటర్ల దూరం ఈడ్చుకెళ్లింది. దీంతో ఆమె మరణించింది. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది.
 

click me!