ఢిల్లీలో కుప్పకూలిన బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు..

By team teluguFirst Published Jan 8, 2023, 6:56 AM IST
Highlights

ఢిల్లీలోని కుతుబ్ రోడ్ ప్రాంతం ఉన్న ఓ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ కూలడంతో ఒకరు మరణించారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వారంతా ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. 

ఉత్తర ఢిల్లీలోని సదర్ బజార్ ప్రాంతంలో ఉన్న నాలుగు అంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్, మెట్లు కూలిపోయాయి. ఈ ఘటనలో 35 ఏళ్ల వ్యక్తి మరణించారు. మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. ఈ ఘటన శనివారం సాయత్రం సమయంలో చోటు చేసుకుంది. దీనిపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. 

వరుస హత్యలతో బెంబెలెత్తిస్తున్న సైకో కిల్లర్.. ఇప్పటి వరకూ మూడు హత్యలు.. హంతకుడిపై రూ. 25 వేల రివార్డు ..

ఈ ఘటనపై తమకు సాయంత్రం 6.28 గంటలకు సమాచారం అందిందని, వెంటనే రెండు ఫైర్ ఇంజన్లతో అక్కడికి చేరుకున్నామని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. కుతుబ్ రోడ్ ప్రాంతంలోని ఒక లోదుస్తుల దుకాణంలో మెట్లు కూలిపోవడంతో అకస్మాత్తుగా శబ్దం వినిపించిదని, ఆ ప్రాంతంలో నుంచి పెద్ద ఎత్తున దూళి బయటకు వచ్చిందని పోలీసులు పేర్కొన్నారు.

ఈ ప్రమాదంలో చనిపోయిన వ్యక్తిని బీహార్‌లోని సీతామర్హి నివాసి గులాబ్‌గా గుర్తించారు. ఆయన తీవ్రగాయాలతో ఉన్న సమయంలో స్థానికులు రక్షించి హాస్పిటల్ కు తరలించారు. కానీ అక్కడ చికిత్స పొందుతున్న సమయంలోనే పరిస్థితి విషమించి మరణించాడని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (నార్త్) సాగర్ సింగ్ కల్సి తెలిపారు. ఆయన కార్మికుడని, దుకాణం యజమాని వద్ద కూడా పని చేస్తున్నాడని పేర్కొన్నారు.

విశాఖపట్నంలో కోటి విలువైన బంగారం పట్టివేత..బంగ్లాదేశ్ నుంచి స్మగ్లింగ్

ప్రత్యక్ష సాక్షుల ప్రకారం.. ఈ ఘటన సమయంలో పేలుడు లాంటి శబ్దం వినిపించింది. దీంతో అక్కడి నుంచి ప్రజలంతా పరుగులు తీశారు. హర్జీత్ సింగ్ ఛబారా అనే మరో సాక్షి ‘ఎన్డీటీవీ’తో మాట్లాడుతూ.. ‘‘ఒక్క సారిగా పెద్ద శబ్దం వచ్చింది. కానీ దాని వెనుక కారణం స్పష్టంగా తెలియలేదు. నా షాప్ పక్కనే ఉన్న బిల్డింగ్ లో ఇది జరిగింది. కొంత సమయం తరువాత పొగ వచ్చింది’’ అని పేర్కొన్నారు. 

ఘటనా స్థలానికి సమీపంలో ఉన్న ఓ సీసీటీవీలో ఈ ప్రమాదం, తరువాత జరిగిన పరిణామాలు రికార్డు అయ్యాయి. బిల్డింగ్ నుంచి దూళి రావడం, అక్కడి నుంచి ప్రజలు పారిపోవడం వంటి దృష్యాలు కనిపిస్తున్నాయి.

మరోసారి ఆడపిల్ల పుట్టిందనీ.. రెండు రోజుల పసికందును గొంతు నులిమి హత్య చేసిన కన్నతల్లి

ఇలాంటి ఘటనే శనివారం హైదరాబాద్ లో చోటు చేసుకుంది. కూకట్ పల్లిలోని బీజేపీ ఆఫీసు సమీపంలోని పాపారాయుడు విగ్రహం వద్ద నిర్మాణంలో వున్న భవనం నాలుగు, ఐదో అంతస్తు స్లాబ్ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో శిథిలాల కింద చిక్కుకున్న ఇద్దరు కూలీలు ప్రాణాలు కోల్పోగా.. భవన యజమానితో పాటు పలువురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న డీఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖ సిబ్బంది శిథిలాల తొలగింపు ప్రక్రియ చేపట్టారు. నాణ్యతా లోపం కారణంగానే భవనం శ్లాబు కూలినట్లుగా తెలుస్తోంది. 
 

click me!