ఫోన్ పాస్ వర్డ్ చెప్పలేదని.. స్నేహితుడి గొంతు కోసి చంపిన స్కూల్ స్టూడెంట్.. !!

By AN TeluguFirst Published Apr 29, 2021, 5:09 PM IST
Highlights

ఢిల్లీలో దారుణహత్య జరిగింది. స్నేహితుడు ఫోన్ పాస్ వర్డ్ చెప్పలేదని ఓ 12 వ తరగతి విద్యార్థి తన 20 ఏళ్ల స్నేహితుడు గొంతు కోసి చంపాడు. ఈ ఘటన వాయువ్య ఢిల్లీలోని పిటంపురా ప్రాంతంలో చోటుచేసుకుంది. 

ఢిల్లీలో దారుణహత్య జరిగింది. స్నేహితుడు ఫోన్ పాస్ వర్డ్ చెప్పలేదని ఓ 12 వ తరగతి విద్యార్థి తన 20 ఏళ్ల స్నేహితుడు గొంతు కోసి చంపాడు. ఈ ఘటన వాయువ్య ఢిల్లీలోని పిటంపురా ప్రాంతంలో చోటుచేసుకుంది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సంఘటన ఏప్రిల్ 21 న ఒక పార్కులో జరిగింది. రోహిణిలోని మహారాజా అగ్రసేన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్‌కు చెందిన బీబీఏ విద్యార్థి అయిన నిందితుడు ఉత్తరప్రదేశ్ కు చెందిన మయాంక్ సింగ్ ను ఉత్తరప్రదేశ్ నుంచి సోమవారం అరెస్ట్ చేశామని తెలిపారు. 

ఢిల్లీలో ఓ ఫ్యాక్టరీ నడుపుతున్న బాధితుడి తండ్రి తన కొడుకు కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. మృతుడు ఏప్రిల్ 21 ఉదయం ఇంటి నుండి వెళ్లి తిరిగి రాకపోవడంతో తండ్రి పోలీసులను ఆశ్రయించాడు.

ఢిల్లీలోని పిటాంపురాలోని ఒక పార్క్ లోని నిర్జన ప్రదేశంలో కుళ్ళిన మృతదేహం ఉందన్న సమాచారం ఆదివారం పోలీసులకు అందింది. మృతదేహం దగ్గర ఒక పెద్ద సైజు టెడ్డి బేర్ కూడా పడి ఉంది, అంతేకాదు ఆ ప్రాంతంలో పోలీసులకు డ్రగ్స్ కూడా దొరికాయని ఓ సీనియర్ అధికారి తెలిపారు. 

దర్యాప్తులో భాగంగా, పోలీసులు సంఘటన స్థలానికి సమీపంలో 100 సిసిటివి కెమెరాలను స్కాన్ చేయగా, నిందితుడు, ఇంకో బాలుడు పార్కులోకి ప్రవేశించడం కనిపించింది. నిందితుడు మయాంక్ సింగ్ ఏప్రిల్ 23 నుండి కనిపించకుండా పోయాడు. అతనికోసం గాలింపు చేపట్టిన పోలీసులకు యూపీలోని ఫిల్కువా ప్రాంతంలో స్నేహితుడి ఇంట్లో పట్టుబడ్డాడు. 

ఏప్రిల్ 21 న పార్కులో బాలుడిని కలిసింది తనేనని నిందితుడు అంగీకరించాడు. మయాంక్ సింగ్ బాధితుడి ఫోన్ పాస్వర్డ్ను ఇవ్వాలని అడిగితే.. అతను నిరాకరించాడు. దీంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. తరువాత, నిందితుడు మొదట బాధితుడిని రాయితో కొట్టాడు, తరువాత తన దగ్గరున్న క్లాత్ తో గొంతు కోసి చంపాడు" అని పోలీసులు తెలిపారు.

click me!