G 20 Summit 2023 : సమాచార మార్పిడికి ‘‘సందేశ్’’ను వాడుతోన్న ఢిల్లీ పోలీసులు .. ఏంటీ దీని స్పెషాలిటీ..?

Siva Kodati |  
Published : Sep 05, 2023, 02:47 PM ISTUpdated : Sep 05, 2023, 02:51 PM IST
G 20 Summit 2023 : సమాచార మార్పిడికి ‘‘సందేశ్’’ను వాడుతోన్న ఢిల్లీ పోలీసులు .. ఏంటీ దీని స్పెషాలిటీ..?

సారాంశం

మరికొద్దిరోజుల్లో న్యూఢిల్లీ వేదికగా జీ 20 సమావేశాలు జరగనున్నాయి. ఢిల్లీ పోలీసులు ఈవెంట్ భద్రత, ఇతర విషయాలను కమ్యూనికేట్ చేసుకోవడానికి ‘‘ Sandes app ’’‌ను ఎంచుకున్నారు. 

మరికొద్దిరోజుల్లో న్యూఢిల్లీ వేదికగా జీ 20 సమావేశాలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లు వేగంగా జరిగిపోతున్నాయి. ప్రపంచ దేశాధినేతలు , ప్రతినిధి బృందం వస్తుండటంతో ఢిల్లీ డేగ కళ్ల పహారాలోకి వెళ్లిపోయింది. ఇప్పటికే నగరంలో హై అలర్ట్ ప్రకటించి.. కఠినమైన ఆంక్షలు విధించారు. ఢిల్లీ పోలీసులు ఈవెంట్ భద్రత, ఇతర విషయాలను కమ్యూనికేట్ చేసుకోవడానికి ‘‘ Sandes app ’’‌ను ఎంచుకున్నారు. దీని గురించి ఐదు ముఖ్యమైన పాయింట్లు చూస్తే :

Also Read: జీ20 సమ్మిట్ కు హాజరయ్యే ప్రతినిధులకు రాష్ట్రపతి విందు: ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ పేరుతో ఆహ్వానాలు

1 . నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) ద్వారా అభివృద్ది చేసిన ఈ యాప్ 2020లో ప్రారంభించారు. అప్పటి నుంచి అవసరమైన అప‌డేట్‌లు చేస్తూ ఆండ్రాయిడ్, ఐవోఎస్, డెస్క్‌టాప్ వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.
2. ఈ యాప్ సమాచారాన్ని సురక్షితంగా మార్పిడి చేసుకోవడానికి అనుమతిస్తుంది. వినియోగదారులు షేర్ చేస్తున్న డాక్యుమెంట్స్ .. సురక్షితమైన ఇంటర్నెట్ ప్రోటోకాల్‌ను అనుసరిస్తాయి. వీటిని యాప్‌లో మాత్రమే వీక్షించగలం. 
3. పోలీస్ ఇన్‌స్పెక్టర్లు, కమీషనర్లు సందేశ్ యాప్‌ను ఉపయోగిస్తున్నారు. ఇన్‌స్పెక్టర్ ర్యాంక్ కంటే తక్కువ స్థాయి పోలీసులకు భద్రతా చర్యల గురించి మౌఖికంగా తెలియజేస్తున్నారు. జీ 20 సదస్సుకు సంబంధించిన సమాచారాన్ని పంపుకునేందుకు పోలీసులు వాట్సాప్‌ను ఉపయోగించడం లేదు.
4. ప్రముఖుల గురించిన సమాచారం, ప్రధాన శిఖరాగ్ర సదస్సు జరిగే ప్రదేశాలతో పాటు ఇతర కార్యక్రమాలు, ప్రముఖులు వెళ్లే మార్గాలు సహా సున్నితమైన సమాచారాన్ని పంచుకోవడానికి పోలీస్ అధికారులు సందేశ్ యాప్‌ను ఉపయోగిస్తున్నారు. దాని అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. సందేశాన్ని అత్యంత రహస్యంగా, ప్రాధాన్యత ఆధారంగా, ఆటో డిలీట్ గుర్తు పెట్టడానికి సందేశ్ వీలు కల్పిస్తుంది. 
5. ఎన్ఐసీ ప్రకారం.. సందేశ్ యాప్‌ను హ్యాక్ చేయడం కష్టం , వ్యక్తిగత ఎండ్ టూ ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేయబడినందున వేరొకరు వీటిని కాపీ చేయలేరు. ఇది ప్రభుత్వ ఆమోదం పొందిన పోలీస్ అధికారుల ఫోన్‌లలో డౌన్‌లోడ్ చేయబడుతుంది తప్పించి.. వారి ప్రైవేట్ పరికరాల్లో కాదు. 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఇదేం చలిరా నాయనా..! చివరకు గోవులకు కూడా దుప్పట్లా..!!
Modi speech at the African Parliament:భారత్–ఇథియోపియా సంబంధాల్లో కొత్త అధ్యాయం | Asianet News Telugu