సోనియా గాంధీ పీఏ మాధవన్‌పై రేప్ కేసు నమోదు.. దళిత మహిళపై లైంగిక దాడి!

By Mahesh KFirst Published Jun 27, 2022, 8:21 PM IST
Highlights

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పీఏ మాధవన్‌పై రేప్ కేసు నమోదైంది. ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ పోలీసు స్టేషన్‌లో ఆయనపై లైంగిక దాడి ఆరోపణల ఆధారంగా పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. కాగా, ఆ ఆరోపణలు అవాస్తవాలని మాధవన్ కొట్టిపారేశారు.
 

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పర్సనల్ అసిస్టెంట్ పీపీ మాధవన్‌పై రేప్ కేసు నమోదైంది. ఈ మేరకు ఢిల్లీ పోలీసులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ పోలీసు స్టేషన్‌లో ఐపీసీలోని సెక్షన్‌లు 376, 506 కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు వివరించారు.

జూన్ 25న పోలీసులకు అందిన ఓ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. పీపీ మాధవన్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి పర్సనల్ సెక్రెటరీగా పని చేస్తున్నట్టు సమాచారం.

ఈ కేసుపై సోనియా గాంధీ పీఏ మాధవన్ స్పందించాడు. ఇవన్నీ నిరాధారమైన కేసులు అని, ఇది తనపై పన్నిన కుట్ర అని కొట్టిపారేశారు.

కొన్ని మీడియా కథనాల ప్రకారం, పీపీ మాధవన్ ఓ దళిత మహిళపై లైంగికదాడికి పాల్పడ్డాడు. జాబ్ ఇంటర్వ్యూ అని, పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు ఆ కథనాలు పేర్కొన్నాయి. ఆ దళిత మహళ భర్త గతంలోనే మరణించాడు. 2020లో ఆయన మరణించే వరకు ఢిల్లీ కాంగ్రెస్ హెడ్‌క్వార్టర్స్‌లలో లేబర్‌గా పని చేసేవాడని తెలిసింది.

click me!