అక్రమ సంబంధం: దూరం పెట్టినందుకు ప్రేయసిని చంపేసిన ప్రియుడు

Published : Jul 16, 2021, 07:59 AM IST
అక్రమ సంబంధం: దూరం పెట్టినందుకు ప్రేయసిని చంపేసిన ప్రియుడు

సారాంశం

దూరం పెట్టినందుకు తన ప్రేయసిని ఓ యువకుడు దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో చోటు చేసుకుంది. నిందితుడు తన నేరాన్ని పోలీసు విచారణలో అంగీకరించాడు.

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఓ వ్యక్తి అత్యంత కిరాతకంగా వ్యవహరించాడు. తనతో కలిసి ఉంటున్న ప్రేయసి విడిపోతానని చెప్పినందుకు ఆగ్రహించిన 24 ఏళ్ల వ్యక్తి ఆమెను గొంతు నులిమి హత్య చేశాడు. ఈ సంఘటన ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో జరిగింది. 24 ఏళ్ల నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

తన భర్త చనిపోయిన తర్వాత మహిళ అతన్ని కలవడానికి ఇష్టపడలేదు. అతనితో మాట్లాడడం మానేసింది. దీంతో అతను ప్రేయసిపై ఆగ్రహంతో ఆమెను హత్య చేశాడు. 

ద్వారక ప్రాంతంలోని తన ఇంట్లో 42 ఏళ్ల మహిళ చనిపోయినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఆ మహిళ 17 ఏళ్ల కూతురు తన ఆంటీ ఇంటికి వెళ్లి సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో తిరిగి వచ్చింది. తన తల్లి మరణించి ఉండడం ఆమెకు కనిపించింది. 

పోలీసులు నిందితుడు కృష్ణను హర్యానాలోని అతని నివాసంలో జులై 12వ తేదీన అరెస్టు చేశారు. అతన్ని రిమాండ్ కు తరలించారు. తనకు దూరంగా ఉండడంతో మహిళను చంపినట్లు అతను విచారణలో అంగీకరించాడు.

PREV
click me!

Recommended Stories

Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు