దుబాయిలో భారతీయుడికి రూ.7కోట్ల లాటరీ..!

Published : Jul 16, 2021, 07:52 AM IST
దుబాయిలో భారతీయుడికి రూ.7కోట్ల లాటరీ..!

సారాంశం

ఆయన కొన్న మిలీనియం మిలియనీర్ లాటరీ టికెట్ తో ఒక్కరోజులో కోటీశ్వరుడైపోయారు.  

దుబాయిలో భారతీయుడికి భారీ లాటరీ తగిలింది.  భారత్ కి చెందిన ఓ ప్రైవేట్ నౌక ఉద్యోగి గణేశ్ శిండేకు దుబాయిలో ఏకంగా మిలియన్ డాలర్ల(రూ.7.45 కోట్ల) లాటరీ తగిలింది. మహారాష్ట్రలోని ఠాణేకు చెందిన గణేశ్.. బ్రెజిల్ సంస్థతలో ఉద్యోగం చేస్తున్నారు.

వృత్తిలో భాగంగా బ్రెజిల్ నుంచి దుబాయికి వచ్చినప్పుడల్లా లాటరీ టికెట్ కొనేవారు. అలా రెండేళ్లుగా కొంటున్న గణేశ్ కు తాజాగా జాక్ పాట్ తగిలింది. ఆయన కొన్న మిలీనియం మిలియనీర్ లాటరీ టికెట్ తో ఒక్కరోజులో కోటీశ్వరుడైపోయారు.

దీంతో... గణేశ్ సంతోషంతో ఎగిరిగంతులు వేస్తున్నాడు.  కొత్త కారు.. కొత్త ఫ్లాట్ కొంటానని... తన పిల్లల చదువు కోసం డబ్బులు దాచుకుంటానని ఆనందంతో చెప్పాడు. కాగా... ఈ మిలీనియర్ లాటరీ ని 1999 లో ప్రారంభించగా.. ఇప్పటి వరకు 181 మంది భారతీయులు విజేతలుగా నిలిచారు. 

PREV
click me!

Recommended Stories

జానకమ్మ జీవితం..ఓ చరిత్ర ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా? | Singer S. Janaki Biography | S Janaki Assets
గాన కోకిల జానకమ్మ చివరి మాటలు ఇవే | Singer S. Janaki No More | Singer S. Janaki Last Word