ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసు.. మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ

By Asianet NewsFirst Published Mar 21, 2023, 11:08 AM IST
Highlights

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి, సీబీఐ రిమాండ్ లో ఉన్న మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ జరగనుంది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు మంగళవారం ఈ పిటిషన్ పై వాదనలు విననుంది. 

దేశ రాజధాని ఢిల్లీలో ఎక్సైజ్ పాలసీ రూపకల్పన, అమలులో అవకతవకలకు సంబంధించి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీలో ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ పై ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు మంగళవారం విచారణ చేపట్టనుంది. ప్రస్తుతం ఈ నెల 22 వరకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కస్టడీలో ఉన్నందున సిసోడియాను సోమవారం వర్చువల్ గా కోర్టులో హాజరుపరిచారు. దీంతో ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మరో 14 రోజులు పొడిగించింది.

మహిళలతో కాథలిక్ ప్రీస్ట్ రాసలీలలు.. లైంగిక వేధింపుల వీడియోలు వైరల్.. అరెస్ట్..

ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్ పాల్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని 2023 ఏప్రిల్ 3 వరకు పొడిగించారు. ఈ కేసులో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ జరగనుంది. ఇప్పటికే అన్ని రికవరీలు పూర్తయినందున తనను కస్టడీలో ఉంచడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని ట్రయల్ కోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ లో సిసోడియా పేర్కొన్నారు.

మీకెందుకు కోపం?: ఢిల్లీ బడ్జెట్ పై ప్రధానికి అరవింద్ కేజ్రీవాల్ లేఖ

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఎప్పుడు పిలిస్తే అప్పుడు తాను దర్యాప్తులో పాల్గొన్నానని సిసోడియా పేర్కొన్నారు. ఈ కేసులో అరెస్టయిన ఇతర నిందితులకు ఇప్పటికే బెయిల్ మంజూరైందని తెలిపారు. తాను ఢిల్లీ డిప్యూటీ సీఎంగా ముఖ్యమైన రాజ్యాంగ పదవిలో ఉన్నానని, సమాజంలో లోతైన మూలాలు ఉన్నాయని సిసోడియా పేర్కొన్నారు.

కేంద్ర‌మంత్రి నితిన్ గ‌డ్క‌రీపై అభ్యంత‌ర‌క‌ర పోస్టులు.. కేసు న‌మోదు

నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (జీఎన్సీటీడీ) ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీ రూపకల్పన, అమలులో అవకతవకలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో సిసోడియా అరెస్టు అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సిసోడియాను సీబీఐ రిమాండ్ కు పంపిన రౌస్ అవెన్యూ కోర్టు.. సుప్రీంకోర్టు నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా సీసీటీవీ కవరేజ్ ఉన్న చోట నిందితుల విచారణ జరగాలని, ఆ ఫుటేజీని సీబీఐ భద్రపరచాలని ఆదేశించింది. 

పశ్చిమ బెంగాల్ లో అక్రమ బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ముగ్గురు మృతి

నిందితుడు గతంలో రెండుసార్లు ఈ కేసు దర్యాప్తులో పాల్గొన్నాడని, అయితే విచారణలో అడిగిన చాలా ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వడంలో అతడు విఫలమయ్యాడని కోర్టు అభిప్రాయపడింది. అందువల్ల ఇప్పటివరకు నిర్వహించిన దర్యాప్తులో అతడిపై వచ్చిన నేరారోపణ సాక్ష్యాలను న్యాయబద్ధంగా వివరించడంలో విఫలమయ్యాడని ట్రయల్ కోర్టు పేర్కొంది. తరువాత రిమాండ్ కు అనుమతి ఇచ్చింది. 

click me!