మహిళలతో కాథలిక్ ప్రీస్ట్ రాసలీలలు.. లైంగిక వేధింపుల వీడియోలు వైరల్.. అరెస్ట్..

By SumaBala BukkaFirst Published Mar 21, 2023, 10:39 AM IST
Highlights

ఆంటోపై దోపిడీ లైంగిక ప్రవర్తన ఆరోపణలు వచ్చాయి. అతను మహిళలకు అశ్లీల సందేశాలు పంపేవాడు. మహిళలను అనుచితంగా ముద్దుపెట్టుకోవడం, తాకడం వంటివి చేసేవాడు. 

తమిళనాడు : తమిళనాడులో ఓ క్యాథలిక్ ప్రీస్ట్ బెనెడిక్ట్ లైంగిక వేధింపుల ఆరోపణలతో అరెస్ట్ అయ్యాడు. కన్యాకుమారిలోని సైరో మలంకర క్యాథలిక్ చర్చికి చెందిన ఒక క్రైస్తవ మతగురువు అనేక మంది మహిళలతో ఉన్న వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో కనిపించడంతో అతడిని పోలీసులు అరెస్టు చేశారు. బెనెడిక్ట్ ఆంటో చాలా సంవత్సరాలుగా చర్చిలో ప్రీస్ట్ గా పనిచేస్తున్నాడు.

వివరాల ప్రకారం, కొన్ని రోజుల క్రితం అతనిపై కొంతమంది వ్యక్తులు దాడి చేశారు. ఆ సమయంలో వారు అతని ల్యాప్‌టాప్‌ను ఎత్తుకెళ్లారు. ఆ ల్యాప్‌టాప్‌ లో ఉన్న అతని ఈ లైంగిక వేధింపుల వీడియోలు, సన్నిహిత వీడియోలు, ఫొటోలను వారు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఈ వీడియోలు, ఫొటోల కంటెంట్ వైరల్ గా మారింది. అంతేకాదు బాధ్యతాయుతమైన దైవసేవకుడి పదవిలో ఉండి.. ఇలాంటి నీచ కార్యాలకు పాల్పడడం ఆగ్రహానికి కారణమైంది. 

కేజ్రీవాల్ థర్డ్ ఫ్రంట్ ప్రయత్నాలు.. ఏడుగురు సీఎంలతో విందు భేటికి ప్లాన్.. కానీ ఏం జరిగిందంటే..!

ఈ వీడియోలు, ఫొటోలలో బెనెడిక్ట్ ఆంటో అనేకమంది మహిళలతో ఉన్నట్లు చూపిస్తున్నాయి. ఆంటోపై దోపిడీ లైంగిక ప్రవర్తన ఆరోపణలు వచ్చాయి. అతను మహిళలకు అశ్లీల సందేశాలు పంపేవాడు. మహిళలను అనుచితంగా ముద్దుపెట్టుకోవడం.. తాకడం వంటివి చేసేవాడని వెలుగు చూసింది. మహిళలతో సన్నిహితంగా ఉండే ఇలాంటి చర్యలను రికార్డ్ కూడా చేశాడు. ఆతరువాత వారి నోరు మూయించడానికి, బ్లాక్ మెయిల్ చేయడానికి వీటిని వాడేవాడు. పూజారి టార్గెట్‌లో మైనర్ బాలికలు కూడా ఉన్నారని తమిళ మీడియా పేర్కొంది.

మినీ అజిత అనే మహిళ ప్రీస్ట్ ఆంటోపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కొడుకు ఆస్టిన్ జినోపై తప్పుడు కేసు పెట్టారని తెలిపింది. వైద్య విద్యార్థిని అయిన తన మహిళా స్నేహితురాలిని వేధించినందుకు తన కొడుకు ఆంటోను ఎదిరించినందుకు అతని మీద తప్పుడు కేసు బనాయించారని తెలిపింది. 

బెనెడిక్ట్ ఆంటో కన్యాకుమారి పశ్చిమ జిల్లాలో సైరో మలంకర కాథలిక్ చర్చి పూజారి. ఈ 30 ఏళ్ల క్రైస్తవ మతగురువు కన్యాకుమారి జిల్లా నాగర్‌కోయిల్ సమీపంలోని మార్తాండమ్‌కు చెందినవాడు. ఒక క్రైస్తవ పూజారిపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం ఇది మొదటిసారి కాదు. 2022లో మైనర్ బాలికపై రెండుసార్లు లైంగిక వేధింపులకు పాల్పడినందుకు అరెస్టయిన ప్రీస్ట్ పాండ్‌సన్ జాన్ గురించి ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. అతను మైనర్ బాలిక మీద ఒకసారి చర్చిలో ఆమెకు 'కౌన్సెలింగ్' ఇస్తున్నప్పుడు, ఒకసారి ఆమె స్వంత ఇంటిలో ఉన్నప్పుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని తేలింది. 

2018లో పూణెలోని ప్రముఖ ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్ స్కూల్‌లో ప్రిన్సిపాల్‌గా ఉన్న ఒక ప్రీస్ట్, విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణతో ముంబైలో అరెస్టు అయ్యాడు. చర్చి ఫాదర్లు ఇలా ప్రవర్తించడం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తుంది. 2019లో, అర్జెంటీనా న్యాయస్థానం మెన్డోజాలో ఇద్దరు కాథలిక్ పూజారులకు 40 సంవత్సరాల కంటే ఎక్కువ జైలు శిక్ష విధించింది. వారు కాథలిక్ నిర్వహించే పాఠశాలలో 10 మంది బధిరులైన పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తేలింది. ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో కూడా ఇలాంటి సంఘటనలు నివేదించబడ్డాయి. ఈ ఘటన నేపథ్యంలో చర్చిలో ఎక్కువ జవాబుదారీతనం, పారదర్శకత ఉండాలని కోరుతున్నారు. 

 

click me!