ఢిల్లీ ప్రభుత్వం స్కూళ్లలో టాయిలెట్స్ నిర్మించి, వాటిని క్లాస్ రూమ్స్ గా లెక్కించింది - బీజేపీ

By team teluguFirst Published Nov 25, 2022, 2:04 PM IST
Highlights

తరగతి గదుల నిర్మాణంలో ఢిల్లీ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని బీజేపీ ఆరోపించింది. విజిలెన్స్ కమిషన్ విడుదల చేసిన నివేదికను ఎత్తిచూపుతూ బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ తన వద్దకు నల్లధనం చేరడంపైనే ఆందోళన చెందుతున్నారని, పిల్లల చదువుల గురించి కాదని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో తరగతి గదుల నిర్మాణంలో అక్రమాలపై విజిలెన్స్‌ డైరెక్టరేట్‌ నివేదిక ఇచ్చిందని అన్నారు.

అనుమతి లేకుండా అమితాబ్ బచ్చన్ పేరు, వాయిస్, పిక్ ను ఉపయోగించకూడదు: ఢిల్లీ హైకోర్టు

అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర మార్గదర్శకాలను ఉల్లంఘించి టెండర్ లేకుండా తరగతి గదులను నిర్మించడానికి ప్రైవేట్ కంపెనీతో కుమ్మక్కు అయ్యారని చెప్పారు. టెండర్లు వేయకుండానే పాఠశాలల్లో నిర్మాణ పనుల పరిధిని పెంచిందని ఆయన ఆరోపించారు. ఢిల్లీ ప్రభుత్వం పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మించిందని, వాటిని తరగతి గదులుగా లెక్కించిందని ఆయన తీవ్రంగా విమర్శించారు.

దారుణం.. మూగ, చెవిటి దళిత యువతిపై సామూహిక అత్యాచారం..

ప్రభుత్వంతో ఓ ప్రైవేట్ సంస్థ కుమ్మక్కై తరగతి గదుల నిర్మాణానికి సంబంధించిన నిబంధనలు షరతులను నిర్ణయించిందని, ఈ విషయం విజిలెన్స్ కమిషన్ ఇచ్చిన నివేదికలో తేలిందని భటియా ఆరోపించారు.‘‘జైల్లో ఉన్న అవినీతి మంత్రిని మీరు బర్తరఫ్ చేయలేదు. విజిలెన్స్ నివేదిక విద్యాశాఖలో అవినీతిని కూడా బహిర్గతం చేసింది. డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ ఢిల్లీ ప్రభుత్వంలో భాగంగా ఉంది. మీ బలహీనమైన భుజాలు ఈ భారాన్ని ఎత్తగలవా? అవినీతి మంత్రిని మీరు బర్తరఫ్ చేయగలరా? ’’ అని ఆయన అన్నారు 

ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలకు తరగతి గదుల నిర్మాణంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై విజిలెన్స్ డైరెక్టరేట్ స్పెషల్ ఏజెన్సీ ద్వారా విచారణకు సిఫారసు చేసిందని గౌరవ్ భాటియా అన్నారు. ఇందులో రూ. 1,300 కోట్ల కుంభకోణం జరిగిందని తెలిపారు.

बनाने थे क्लासरूम, बना रहे थे बाररूम-ये चरित्र है अरविंद केजरीवाल का और मनीष सिसोदिया का-श्री
pic.twitter.com/a4xWWaYYMf

— BJP Delhi (@BJP4Delhi)

ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలకు తరగతి గదుల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విజిలెన్స్ డైరెక్టరేట్ "ప్రత్యేక ఏజెన్సీ" చేత దర్యాప్తుకు సిఫారసు చేసింది, ఇది "1,300 కోట్ల రూపాయల కుంభకోణం" అని పేర్కొంది. ఢిల్లీ ప్రభుత్వ విజిలెన్స్ డైరెక్టరేట్ దర్యాప్తునకు సిఫారసు చేసిన నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమర్పించినట్లు ఆయన తెలిపారు.

ప్రియురాలితో శృంగారంలో ఉండగా గుండెపోటు.. 67యేళ్ల వ్యక్తి అనుమానాస్పద మృతి కేసులో ట్విస్ట్...

కాగా..  2020 ఫిబ్రవరి 17 నాటి నివేదికలో పీడబ్ల్యూడీ ద్వారా ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో 2,400 తరగతి గదుల నిర్మాణంలో స్పష్టమైన అవకతవకలను సీవీసీ ఎత్తిచూపింది. ఈ విషయంపై తన అభిప్రాయాలను వెల్లడించాలని కోరుతూ 2020 ఫిబ్రవరిలో ఢిల్లీ ప్రభుత్వ విజిలెన్స్ డైరెక్టరేట్ కు సీవీసీ నివేదికను పంపింది. 
 

click me!