ఛత్తీస్‌గడ్‌లో బీజేపీ నేతను చంపేసిన మావోయిస్టులు.. పోలింగ్‌కు మూడు రోజుల ముందే దారుణం

By Mahesh K  |  First Published Nov 4, 2023, 9:57 PM IST

ఛత్తీస్‌గడ్‌లో మావోయిస్టులు దారుణానికి పాల్పడ్డారు. ఓ బీజేపీ నేతను బహిరంగంగా గొడ్డలితో నరికి చంపారు. పోలింగ్‌కు మూడు రోజుల ముందే ఎన్నికల కోసం క్యాంపెయిన్ చేస్తున్న బీజేపీ నేత రతన్ దూబేను హత్య చేశారు.
 


రాయ్‌పూర్: ఛత్తీస్‌గడ్‌లో మావోయిస్టులతో సమస్యాత్మక ప్రాంతాలుగా ఉన్నందునే అసెంబ్లీ ఎన్నికలను రెండు విడుతలుగా నిర్వహిస్తున్నారు. తొలి విడత 7వ తేదీన పోలింగ్ జరగనుంది. ఈ పోలింగ్‌కు మూడు రోజుల ముందే మావోయిస్టులు ఓ బీజేపీ నేతను చంపేశారు. బీజేపీ నారాయణ్ పూర్ జిల్లా యూనిట్‌ ఉపాధ్యక్షుడు రతన్ దూబే క్యాంపెయిన్ చేస్తుండగా మావోయిస్టులు గొడ్డలితో నరికి చంపేశారు. జిల్లాలోని కౌశల్నార్ ఏరియాలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది.

రతన్ దూబే కౌశల్నార్ మార్కెట్ ఏరియాలో క్యాంపెయినింగ్ కోసం వెళ్లారు. అక్కడే మావోయిస్టులు గొడ్డలితో నరికి చంపేశారు. ఇటీవలే మావోయిస్టులు ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఎన్నికల్లో పాల్గొనరాదని వారు ఓ వార్నింగ్ ఇచ్చారు. ఓ పోలీసు బృందం స్పాట్‌కు చేరుకున్నట్టు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈ హత్యను తాము దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

Latest Videos

Also Read: ఎస్సీ వర్గీకరణపై ప్రధాని మోడీ ప్రకటన?.. మరోసారి వర్గీకరణపై చర్చ

నవంబర్ 7వ, 17వ తేదీల్లో ఛత్తీస్‌గడ్‌లో రెండు విడుతలుగా పోలింగ్ జరుగుతున్నది. నారాయణ్ పూర్‌లో నవంబర్ 7వ తేదీనే పోలింగ్ జరగనుంది. సరిగ్గా పోలింగ్‌కు మూడు రోజుల ముందే మావోయిస్టులు ఈ హత్య చేయడం గమనార్హం.

click me!